రేపు ఏదులాపురం మున్సిపాలిటీలో‘ప్రజా దర్బార్’ :తుంబూరు దయాకర్ రెడ్డి!!

Pathi Sreenivas Rao
2 Min Read

ఖమ్మం: సామాన్యుల సమస్యలకు సత్వర పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా దర్బార్’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, అధికారులే నేరుగా ప్రజల వద్దకు వచ్చి వారి ఇబ్బందులు తెలుసుకొని పరిష్కరిస్తుండటంతో పాలేరు నియోజకవర్గ ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.ఇందులో భాగంగా రేపు (సోమవారం) ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 17 వార్డుల ప్రజల కోసం భారీ స్థాయిలో ప్రజా దర్బార్‌ను నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జి శ్రీ తుంబూరు దయాకర్ రెడ్డి ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు…..

రేపు (సోమవారం), మధ్యాహ్నం 2:00 గంటలకు.
సెయింట్ జోసెఫ్స్ హైస్కూల్ మైదానం, వరంగల్ క్రాస్ రోడ్డు.ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 25, 26, 27, 28, 29 వార్డుల ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన భూ వివాదాలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రేషన్ కార్డుల దరఖాస్తులపై ఈ ప్రజా దర్బార్‌లో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి ఇప్పటికే అధికారులను కఠినంగా ఆదేశించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వయంగా హాజరుకానున్నారు. ఆయన ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ఒకే వేదికపై ప్రజలకు అందుబాటులో ఉంటారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ప్రతి విన్నపాన్ని మంత్రి స్వయంగా పర్యవేక్షించనున్నారు….

ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించే ఈ చివరి ప్రజా దర్బార్‌ను పైన పేర్కొన్న 17 వార్డుల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తుంబూరు దయాకర్ రెడ్డి కోరారు. ప్రజలతో పాటు ఆయా వార్డుల కౌన్సిలర్లు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment