తెలంగాణ /హైదరాబాద్:
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ నేల వేలాది మంది బలిదానాలు, రక్తంతో తడిసిన నేల అని, ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు ఒకటి, రెండు సార్లు ఆలోచించుకోవాలని హెచ్చరించారు. బుధవారం జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా తిప్పికొట్టారు.ప్రజాస్వామ్య భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ఏ నాయకుడైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చని, నిరభ్యంతరంగా పోటీ చేయవచ్చని కేటీఆర్ స్పష్టం చేశారు, పవన్ కళ్యాణ్ గతంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కూడా తెలంగాణలో పోటీ చేశారని గుర్తుచేశారు మిమ్మల్ని ఎవరూ అడ్డుకోలేదని, ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే దానికి ప్రజల నిర్ణయమే కారణం తప్ప తాము కాదని అన్నారు.తెలంగాణలో రాజకీయాలు చేయాలనుకుంటే ఇక్కడి పరిస్థితులు, ప్రజల ఆకాంక్షలు, వారి త్యాగాలను గౌరవించాలని హితవు పలికారు.
తెలంగాణ భమి పుత్రుల జాగీరు…..
‘తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు’ అనే అర్థంలో వచ్చిన మాటలపై కేటీఆర్ స్పందిస్తూ.. “ముమ్మాటికి తెలంగాణ ఈ నేల కోసం కష్టపడి, పోరాటాలు చేసి, నెత్తురు చిందించిన నాలుగు కోట్ల మంది భూమి పుత్రుల జాగీరు” అని గట్టిగా ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారు ఇక్కడే నివసించడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి గత 10-12 ఏళ్లుగా ఎలాంటి సమస్యా రాలేదని, తాము ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలనే కోరుకుంటున్నామని తెలిపారు…ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరమంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు.నాడు మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరుపడాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు ఆత్మబలిదానం చేసుకున్న పోరాటాన్ని కూడా పవన్ ప్రాంతీయవాదం అంటారా? అని ప్రశ్నించారు అలాగే, జాతీయవాదం ముసుగులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు రావాల్సిన కేన్స్ (Kayan), మైక్రాన్ వంటి భారీ పరిశ్రమలను గుజరాత్‌కు తరలించుకుపోవడాన్ని ఏమనాలని, అది ఆర్థిక ప్రాంతీయవాదం కాదా అని నిలదీశారు….
“ఇంటికొస్తే బిర్యానీ పెడతాం.. కానీ పెత్తనం చెల్లదు.. మాకు ‘ఓజీ’ కేసీఆర్ ఉన్నారు”….
భవిష్యత్తులో తెలంగాణలో జనగణమన కూడా పాడరేమో అన్న పవన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ.. దేశభక్తి గురించి తాము పవన్ కళ్యాణ్ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు.నాడు నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాడిన వీరుల నేల ఇదని, తెలంగాణ భారతదేశ జనాభాలో 3% కంటే తక్కువ ఉన్నప్పటికీ దేశ జీడీపీకి 5% కాంట్రిబ్యూట్ చేస్తోందని గుర్తుచేశారు…పవన్ కళ్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్ఉ పముఖ్యమంత్రిగా, ఒక నటుడిగా తాము ఎల్లప్పుడూ గౌరవిస్తామని, సోదరుడిగా తమ ఇంటికి వస్తే హైదరాబాదీ బిర్యానీ పెట్టి ఆదరిస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు కానీ ఇక్కడి సెక్రటేరియట్‌లో కూర్చుని పెత్తనం చేస్తామంటే ఒప్పుకునేది లేదన్నారు.పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ (OG) సినిమాను ప్రస్తావిస్తూ.. “తెలంగాణకు అసలైన ఓజీ మా కేసీఆర్ గారు. ఇక్కడి సమస్యలను, రాష్ట్రాన్ని చూసుకోవడానికి మా కేసీఆర్ ఉన్నారని” పవన్ కళ్యాణ్ ను కేటీఆర్ హెచ్చరించారు……
పత్తి శ్రీనివాస్,జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
