అభివృద్ధి చేసి చూపాకే మళ్లీ ఓట్లు అడుగుతా.. మీ ఇంటి పెద్ద కొడుకుగా పాలేరు రుణం తీర్చుకుంటా!!

Pathi Sreenivas Rao
2 Min Read

పాలేరు (రామన్నపేట): మాటలు చెప్పడం కాదు.. పనులు చేసి చూపించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని రామన్నపేట క్లస్టర్ పరిధిలో నిర్వహించిన ‘ప్రజా దర్బార్’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి భారీగా వచ్చిన అర్జీలను స్వయంగా స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు….

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. “గత ఎన్నికల్లో పాలేరు ప్రజలు నాపై ఎంతో నమ్మకంతో భారీ మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కేబినెట్‌లో మంత్రిగా పనిచేస్తూ మీకు సేవ చేసే గొప్ప అవకాశాన్ని కల్పించారు. నియోజకవర్గ అభివృద్ధి, పేదల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తూ పాలేరు ప్రజల రుణం తీర్చుకుంటాను” అని ఆయన పేర్కొన్నారు….

గత ప్రభుత్వం లాగా రాజకీయాల కోసం హామీలు ఇవ్వబోనని పేర్కొంటూ, “నేను మాటలు చెప్పే వ్యక్తిని కాదు, పని చేసి చూపే మనిషినని. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించి, ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చిన తర్వాతే మళ్లీ మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతానని.ఇది మీ ఇంటి పెద్ద కొడుకుగా ‘శ్రీనన్న’ ఇస్తున్న మాట” అని ప్రజలకు మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు…..

నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ వేగవంతం చేశామని, త్వరలోనే అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని ప్రకటించారు.భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ‘భూ భారతి’ కార్యక్రమం ఎంతో దోహదపడుతోందని, రైతుల ఇబ్బందులను తొలగిస్తామని చెప్పారు.న్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా విశ్వాసాన్ని పొందుతోందని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు..

ప్రజా దర్బార్‌లో వచ్చిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ మరియు ఇతర శాఖల ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా క్షేత్రస్థాయిలోనే పరిష్కారం లభించాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, వివిధ శాఖల జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, క్లస్టర్ పరిధిలోని సర్పంచులు, ప్రజా ప్రతినిధులు మరియు రామన్నపేట క్లస్టర్ పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…,.

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment