బండి సంజయ్ కుమారుడి వివాదం: రాజకీయ కోణం ఉందా? జర్నలిస్ట్ సాయి విశ్లేషణ !!

Pathi Sreenivas Rao
2 Min Read

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం బిజెపి ఎంపీ బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన ఉదంతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో జర్నలిస్ట్ సాయి ఈ వ్యవహారంపై స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చట్టం తన పని తాను చేయాలని చెబుతూనే, ఈ విషయంలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలను ఆయన విశ్లేషించారు.బండి సంజయ్ కుమారుడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో, అతడిని సమర్థించాల్సిన అవసరం లేదని సాయి స్పష్టం చేశారు,ఒకవేళ తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా కేసు నమోదు చేయాలని, అరెస్ట్ చేసి విచారించాలని ఆయన పేర్కొన్నారు,  ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు…..

ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న ‘రేప్’ ఆరోపణల విషయంలో సాయి విభేదించారు. నిందితుడు మరియు బాధితురాలు గత రెండేళ్లుగా స్నేహంగా ఉన్నారని, వారు కలిసి వివిధ ప్రాంతాలకు, గుడులకు వెళ్ళిన ఫోటోలు, వీడియోలు ఉన్నాయని ఆయన వెల్లడించారు వారిద్దరూ సరదాగా సమయాన్ని గడిపారని, ఆ వయసులో వచ్చే పొరపాట్లు లేదా పెళ్లికి సంబంధించిన విభేదాలు ఉండి ఉండవచ్చని ఆయన విశ్లేషించారు దీన్ని అత్యాచారంగా చిత్రీకరించడం వెనుక రాజకీయ కోణం ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అదే విధంగా కుమారుడి ప్రవర్తన, స్నేహితులతో తిరగడం, మద్యం అలవాట్లు వంటి అంశాలపై బండి సంజయ్ తన కుటుంబ పరంగా బాధ్యత తీసుకోవాలని సాయి సూచించారు,పిల్లల నడవడికను సరిదిద్దుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులపై ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఈ వివాదంలో అతిగా స్పందిస్తున్న కమ్యూనిస్టు మహిళా నాయకురాళ్ళు మరియు బీఆర్ఎస్ నాయకులపై సాయి విమర్శలు గుప్పించారు. గతంలో టీసీఎస్ ఉదంతంలో ఎనిమిది మంది మధ్యతరగతి మహిళలు లైంగిక వేధింపులకు గురైనప్పుడు, మతం మార్చాలని ఒత్తిడి వచ్చినప్పుడు నోరు మెదపని వీరు, ఇప్పుడు బండి సంజయ్ విషయంలో మాత్రం ఇంతలా గొంతు పెంచడం వెనుక ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు, మొత్తం మీద బండి సంజయ్ కుమారుడి వ్యవహారంలో చట్టపరమైన విచారణ జరగాలని, అయితే దీన్ని రాజకీయంగా వాడుకోవడం సరికాదని జర్నలిస్ట్ సాయి తన విశ్లేషణ ద్వారా వెల్లడించారు…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment