చట్టం ఎవరికీ చట్టం కాదు,నిజంగా తప్పు చేస్తే నా కొడుకును కూడా క్షమించను:బండి సంజయ్!!

Pathi Sreenivas Rao
2 Min Read

కరీంనగర్: కరీంనగర్‌లో నిర్వహించిన ‘హిందూ ఏక్తా యాత్ర’లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో బీజేపీ అగ్రనేత, ఎంపీ బండి సంజయ్ తన కుమారుడికి సంబంధించిన వివాదంపై భావోద్వేగంతో స్పందించారు. వేలాది మంది కార్యకర్తలు, ప్రజల సమక్షంలో ఆయన తన మనసులోని మాటను పంచుకున్నారు.నా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక,నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నాపై,నా కుటుంబంపై రాజకీయంగా కుట్రలు చేస్తున్నారని,కుట్రలు చేసిన వారిని వదిలిపెట్టబోనని కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రంగా హెచ్చరించారు.

ప్రజాజీవితంలో బిజీగా ఉండటం వల్ల తన కొడుకుకు తగినంత సమయం ఇవ్వలేకపోయానని, కనీసం అతడితో సరిగా మాట్లాడలేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేసిన ఏకైక తప్పు అదేనని ఆయన పేర్కొన్నారు.తాను ఏ తప్పూ చేయలేదని, నిజాయితీగా బయటకు వస్తానని తన కుమారుడు తనకు మాట ఇచ్చాడని బండి సంజయ్ తెలిపారు.చట్టం ఎవరికీ చట్టం కాదని స్పష్టం చేశారు.నిజంగా నా కుమారుడు ఏదైనా తప్పు చేసి ఉంటే, ఖచ్చితంగా శిక్ష పడాలని ఆయన అన్నారు. “నా కొడుకుకు ఒక చట్టం, ఇతరులకు మరో చట్టం ఉండాలని నేను కోరుకోను” అని చెబుతూ, చట్టం దృష్టిలో అందరూ సమానమేనన్న విషయాన్ని నొక్కి చెప్పారు……

తన కుమారుడిని ఒక క్రిమినల్‌గా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక తండ్రిగా ఈ పరిస్థితిని భరించడం ఎంతో కష్టమని ఆయన అన్నారు. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని, స్నేహితుల మధ్య జరిగిన చిన్నపాటి వివాదమేనని ఆయన వివరించారు. తన కుమారుడు “నేను ఏ తప్పు చేయలేదు, నిజాయితీగా బయటకు వస్తాను” అని చెప్పినప్పుడు, తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు.తన రాజకీయ జీవితం కారణంగా తన కుటుంబం, ముఖ్యంగా తన భార్య ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా ఆయన ప్రస్తావించారు.బ్యాంక్ ఉద్యోగి అయిన తన భార్య, తన రాజకీయ కార్యకలాపాల వల్ల కార్యకర్తలు బ్యాంక్ వద్దకు వచ్చి ఇబ్బంది పెడుతుండటంతో ఉద్యోగానికి సెలవు పెట్టాల్సి వచ్చిందని తెలిపారు.కార్యకర్తల సమస్యలను తీర్చడానికి ఆమె ఎప్పుడూ ముందుంటుందని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె ఎంతో మానసిక వేదనకు గురవుతోందని ఆవేదన చెందారు…రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఒక తల్లి పడుతున్న ఆవేదనను, తన కుమారుడి పరిస్థితిని వివరిస్తూ ఆయన చేసిన ప్రసంగం సభలో ఉన్న వారిని కలిచివేసింది…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment