తలసేమియా చిన్నారులకు ‘ఎర్రని’ భరోసా: ఎరుపు రంగు కాంతుల్లో మెరిసిన ఖమ్మం!!

Pathi Sreenivas Rao
2 Min Read

ఖమ్మం సిటీ: తలసేమియా వ్యాధితో పోరాడుతున్న చిన్నారులకు “మేమంతా ఉన్నాం” అంటూ ఖమ్మం నగరం గొంతు కలిపింది. ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకొని, ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు మరియు టీఎస్ సీఎస్ (TSCS) జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు నగరంలో నిర్వహించిన ‘లైట్ అప్ రెడ్’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది…..

తలసేమియా బాధితులకు సంఘీభావంగా శుక్ర, శనివారాల్లో ఖమ్మంలోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు ఎరుపు రంగు విద్యుత్ కాంతులతో వెలిగిపోయాయి.రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయం,డాక్టర్ కూరపాటి చిల్డ్రన్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్,టీఎస్ సీఎస్ బిల్డింగ్,ప్రభుత్వ మెడికల్ కళాశాల,జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల భవనాలన్నీ ఎరుపు వెలుగులు విరజిమ్ముతూ, చిన్నారులకు భరోసాగా నిలుస్తామనే సందేశాన్ని చాటిచెప్పాయి….

తలసేమియా సొసైటీలో డాక్టర్ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి, చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా ‘ఖమ్మం టెడ్డి టీం’ సభ్యులు చిన్నారులతో కలిసి ఆడిపాడి వారిలో ఉత్సాహాన్ని నింపారు.కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, బాధితులకు ప్రాణాధారమైన రక్తాన్ని అందించేందుకు భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల యుగంధర్ మరియు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ స్వయంగా రక్తదానం చేసి యువతకు స్ఫూర్తిగా నిలిచారు.‘యువం ఫౌండేషన్’ పిలుపుతో పౌండేషన్ కు చెందిన సుమారు 50 మంది యువకులు ఉత్సాహంగా రక్తదానం చేశారు…..

ఈ సందర్భంగా తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ గత 13 ఏళ్లుగా డాక్టర్ ప్రదీప్ కుమార్ తలసేమియా చిన్నారుల కోసం చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని,వారికి ఆత్మబంధువుగా నిలిచి ఉచిత వైద్యం, రక్తం అందిస్తున్నారు. ప్రభుత్వం ద్వారా హెచ్‌బీ ఏ2 (HbA2) పరీక్షలు నిర్వహించేలా నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు, అదే విధంగా ఖమ్మం ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రెహనా బేగం, సెక్రటరీ డాక్టర్ కోటేశ్వరరావు, ట్రెజరర్ డాక్టర్ కూరపాటి ప్రీతి మాట్లాడుతూ.. తలసేమియా రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ సనాఉల్లా, డాక్టర్ సిద్ధార్థ్, వాలంటీర్లు నరేష్, అభిషేక్, మల్లేష్, నజీర్, మోతిలాల్ మరియు టీఎస్ సీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment