తెలంగాణ /ఖమ్మం జిల్లా:
నేలకొండపల్లి (ఖమ్మం జిల్లా):ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, పాలనను ప్రజల గడప వద్దకే తీసుకురావాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. బుధవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం గ్రామంలో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన “ప్రజా దర్బార్” కు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, జిల్లా కలెక్టర్, స్థానిక నాయకులు పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు…..

ప్రజలనుండి అర్జీలను స్వీకరిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి….
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.వడ్లంటే ఏంటో తెలియని వారు కూడా నేడు కళ్లాల దగ్గర ఫోజులిస్తూ రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారని మండిపడ్డారు.గతంలో మద్దతు ధర అడిగిన రైతుల చేతులకు బేడీలు వేసి జైల్లో పెట్టిన చరిత్ర గత పాలకులదని, రుణమాఫీ చేయకుండా, సబ్సిడీ పథకాలను ఎగవేసి రైతులను ఇబ్బందులకు గురిచేశారని గుర్తుచేశారు,రెండుసార్లు అధికారాన్ని ఇస్తే రాష్ట్ర ప్రగతిని విస్మరించి, లక్షల కోట్లు కొల్లగొట్టి విదేశీ ఖాతాల్లో జమ చేసుకున్నారని ఆరోపించారు. ఏ వ్యాపారం చేసి ఇన్ని ఆస్తులు సంపాదించారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు…..

మంత్రి పొంగులేటి సమక్షంలో ఓ మహిళ భావోద్వేగం….
“నాడు వరి వేస్తే ఉరి అన్న పరిస్థితి ఉండేది.. కానీ నేడు వరి గింజకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ అందిస్తున్నాం” అని నేతలు పేర్కొన్నారు. పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని, వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతోందని వివరించారు.
ప్రజా దర్బార్‌లో అందిన దరఖాస్తులపై స్పందిస్తూ కీలక హామీలు ఇచ్చారు,అర్హులైన పేదలందరికీ రాబోయే మూడు, నాలుగు విడతల్లో ఖచ్చితంగా ఇండ్లు మంజూరు చేస్తాం.పింఛన్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో క్యాబినెట్‌లో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు…..

ప్రజాదర్బార్ సభలో ప్రసంగిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి….
‘భూభారతి’ ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యలన్నింటికీ శాశ్వత విముక్తి కలిగిస్తామని.ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలు లేకుండా, నేరుగా మీ వద్దకే వచ్చి సమస్యలు పరిష్కరిస్తున్నామని, ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి గారితో పాటు జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు మరియు గువ్వలగూడెం క్లస్టర్ పరిధిలోని గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు…..

జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
