తెలంగాణ/ఖమ్మం జిల్లా/రఘునాథపాలెం మండలం:
రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయ్ నగర్లో “మట్టి మాఫియా” రెచ్చిపోతుంది, స్థానిక సాధనా కాలేజీ పక్కన పట్ట పగలు ఓ అధికార పార్టీ నాయకుడు మైనింగ్, రెవెన్యూ శాఖల నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ఏదెచ్చగా మట్టి తవ్వకాలు జరపడం,పదుల సంఖ్యలో ట్రాక్టర్లు పెట్టీ తవ్విన మట్టిని బయటకు తరలించడం సంచలనం సృష్టిస్తుంది,ఈ క్రమంలో ప్రశ్నించిన వాళ్లపై భౌతిక దాడులకు సైతం వెనుకాడడటం లేదంటే పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా తయారయ్యాయి అనే దానికి ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది….

అక్రమ మట్టి తవ్వకాలకు ఉపయోగిస్తున్న జేసిబి…..
ఈ మొత్తం వ్యవహారంలో “మట్టి మాఫియా” వెనుక మండలంలో అన్నీ తానై నడిపించే ఓ జిల్లా మంత్రికి సంబంధించిన ఇద్దరు ప్రధాన అనుచరులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధి,అతని కుమారుడు “కలిసి మట్టి మాఫియా”ను పెంచి పోషిస్తున్నారని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు,అంతే కాకుండా మండలానికి సంబంధించిన ప్రతి అంశంలో ఈ నాయకులే కీలకంగా వ్యవహరిస్తూ,వారికి ఎదురు తిరిగి జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించిన సామాన్య ప్రజలపై పోలీసు స్టేషన్లో అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు….

నివాస ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు జరుపుతున్న దృశ్యం…..
అదే విధంగా ఈరోజు సాధనా కాలేజీ పక్కన అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయంటూ మైనింగ్ అధికారులకు స్థానికులు పోన్ చేసి సమాచారం అందించగా వారు చెప్పిన సమాధానం విని పోన్ చేసిన స్థానికులకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది,ఆది అక్రమ మట్టి తవ్వకాలని మీకెలా తెలుసూ,ఏదైనా ఉంటే మీ మండల ఎమ్మార్వోకో లేకుంటే మీ పోలీస్ స్టేషన్ సిఐకో పిర్యాదు చేసుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆశ్చర్య పోవడం స్థానికుల వంతైంది,అసలు చర్యలు తీసుకోవాల్సిన మైనింగ్ అధికారులు చేతులెత్తేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలంటూ స్థానికులు వాపోతున్నారు,దీంతో మొత్తం మీద దొంగలు,దొంగలు కలిసి ఊళ్లు పంచుకుంటుంటే చేసేదేమీ లేక చేష్టలుడిగి చూడం స్థానికుల వంతు అయినట్లుందని స్థానికులు గుసగుసలాడుకోవడం విశేషం….
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
