ముగింపు దశకు చేరుకున్న ఖమ్మం,దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు!!

Pathi Sreenivas Rao
2 Min Read

ఖమ్మం,దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు దాదాపు పూర్తి అయ్యాయి,ఖమ్మం నగరం ధంసళాపురం వద్ద మున్నేరుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు పూర్తి కాగా రైల్వే బ్రిడ్జి నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి, ఖమ్మం నుండి ఆంధ్రప్రదేశ్ప రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి పచ్చని పొలాల మధ్య సాగిపోయే విశాలమైన రోడ్డు, ఇరువైపులా సౌర విద్యుద్దీపాలు,కిలోమీటర్‌ దూరం వరకు నిఘా ఉంచగలిగే సోలార్‌ సీసీ కెమెరాలు,ఎక్కడైనా ప్ర మాదం జరిగితే వెంటనే కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం ఇచ్చేలా ఆధునిక సాంకేతిక ఏర్పాటు చేశారు…

ఖమ్మం, దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తే
తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి రాజమండ్రి, విశాఖపట్నం మధ్య రాకపోకలకు అనువైన మార్గంగా మారనుంది,ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌ వెళ్లాలంటే సూర్యాపేట-విజయవాడ మీదుగా పన్నెండు గంటలు ప్రయాణించాల్సి వస్తోంది,ఖమ్మం-దేవరపల్లి హైవే ప్రారంభం అయితే దాదాపు యాభై ఆరు కిలోమీటర్ల మేర దూరం తగ్గడంతో పాటు సుమారు నాలుగు గంటల వరకు ప్రయాణ సమయం ఆదా అయ్యే అవకాశం వుంది,ఈ రహదారి నిర్మాణంలో గొప్ప విశేషం ఏమిటంటే అన్ని రహదారుల మాదిరిగా కాకుండా ఈ రహదారిపై ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరానికే టోల్‌చార్జీలు చెల్లించే ఏర్పాటు చేయడం చెప్పుకోదగ్గ విషయం…..

ఈ రహదారి నిర్మాణం ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల రవాణా సౌకర్యాలు పెంపొందించే కీలక రహదారి కావడంతో ఈ రహదారి ప్రారంభం కోసం ప్రజలు వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నారు,ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ప్రయాణ సమయం చాలా వరకు తగ్గిపోనుండడంతో ఆ ప్రాంత ప్రజలు రహదారి నిర్మాణం పట్ల హర్షతిరేఖాలు వ్యక్తం చేస్తున్నారు ,రోడ్డు నిర్మాణ పనులు దాదాపు చివరి దశకు చేరుకోవడంతో మేలో పూర్తిస్థాయిలో రాకపోకలు ప్రారంభమవుతాయని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు, దీంతో మే నెల చివరి వారంలో గ్రీన్ ఫీల్డ్ హైవే ప్ర్రారంభం చేయడానికి జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది….

📄 Generate e-Paper Clip
Share This Article