జనం ముచ్చట, ఖమ్మం జిల్లా:
సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రంపై ఆ పార్టీ కేంద్ర కమిటీ అభిశంసన లేఖ విడుదల చేయడంతో “అభిశంసన”ను ఉద్దేశించి నిఖార్సైన సిపిఎం కార్యకర్త పేరుతో సోషల్ మీడియాలో, వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న ఒక పోస్టుపై ఇటు ఖమ్మం ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతుంది,ముఖ్యంగా ఈ పోస్టులోసిపిఎం పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీల తీరుపై సంధించిన ప్రశ్నలు ప్రజల్లో ఆసక్తిని రేపుతున్నాయి….
పోస్టు పూర్తి సారాంశం……
డియర్ కామ్రేడ్స్ సిపిఎం కేంద్ర కమిటీ వ్రాసిన అభిశంసన లేఖ సారాంశం ఏమిటి? ఆది తమ్మినేని పైన అభిశంసనా ?లేక క్రమ శిక్షణ చర్యనా ? ఆది అభిశంసనే అయితే ఆయన అండతో ఉమ్మడి ఖమ్మం,వరంగల్,నల్గొండ జిల్లాలలో గ్రూప్ రాజకీయాలు నడిపిస్తున్న జిల్లా నాయకత్వం సంగతి ఏమిటి ? 2008 జులై నెలలో తమ్మినేనిపై వచ్చిన “నిప్పుకు చెదలు”(తమ్మినేని నిర్వాకం)వాస్తవిక వాదులు వ్రాసిన పుస్తకంలో పొందుపర్చిన విషయాలు వాస్తవాలేనా…?అంటే అవుననే విషయం పద్దెనిమిది ఏళ్ల తరువాత నిజమని రుజువయ్యాయి, పద్దెనిమిది ఏళ్ల తర్వాతనే సిపిఎం కేంద్ర కమిటీకి తమ్మినేని లోపాలు తెలిశాయా…? మరీ ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఆయన తొత్తులుగా మారిన పార్టీలో ఉన్న రివిజనిస్టుల సంగతేంటి…? 2008 లోనే ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన “నిప్పుకి చెదలు” పుస్తకంలో తమ్మినేని స్వార్ధ ప్రయోజనాల కోసం గ్రూప్ రాజకీయాలు, కుల రాజకీయాలా వల్ల పార్టీని ఎలా దుర్వినియోగం చేశాడు,నియంతల మారి పార్టీలో ప్రశ్నించిన నిజాయితీపరులను బయటికి ఎలా పంపించాడో అందరికీ తెలిసిన విషయాలే, ఈ పద్దెనిమిది ఏళ్ళ కంటే ముందు,ఆ తర్వాత తమ్మినేని వల్ల పార్టీలో ఇబ్బందులు పడ్డవారు లేరా…? పార్టీ నుండి బయటికి నెట్టబడ్డవారు లేరా…? ఆయనను తట్టుకోలేక బయటికి వెళ్ళినవారు లేరా…?
2008 లోనే ఆయన వైఖరిపై,ఆయన మద్దతుదారులపై ఆధారాలతో సహా ఆనాడే కొన్ని వందల లేఖలు కేంద్ర, రాష్ట్ర పార్టీలకి లేఖలు వ్రాసినా పట్టించుకోకుండా ఆయనను వెనుకేసుకొని వచ్చిన కేంద్ర, రాష్ట్ర కమిటీలకు తమ్మినేని వీరభద్రం తప్పులు ఇపుడే ఎందుకు గుర్తుకొచ్చాయి,
ఈ పద్దెనిమిది ఏళ్ళలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజలలో ఆదరణ ఉండి, పార్టీ కోసం వారి జీవితాలను త్యాగం చేసి,ఎంతో చెమటోడ్చి,దాడులను,నిర్బంధాలను ఎదుర్కొని,ఒక నికార్సైన నిబద్ధత కలిగిన సిపిఎం పార్టీని నిర్మించిన కరుడుగట్టిన వందలాది మంది ప్రజా నాయకులను,కార్యకర్తలను తమ్మినేని ఒంటెద్దు పోకడల వలన సిపిఎం పార్టీ కోల్పోయింది, ప్రస్తుతం సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ అనేది వాస్తవమే కానీ ఆయన వైఖరిపై ఆనాడే కేంద్ర,రాష్ట్ర కమిటీలు స్పందించి ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో CPM పార్టీ ఇంత బలహీనపడి ఉండేది కాదు,
ఇంత మంది మంచి మంచి నాయకులను,కార్యకర్తలను కోల్పోయేది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు….
సిపిఎం పార్టీలో తమ్మినేని ఇన్ని సంవత్సరాల పాటు పెడ ధోరణులకు పాల్పడానికి ఊతం ఇచ్చిన,భజన చేసిన ఉమ్మడి ఖమ్మం,నల్గొండ,వరంగల్ జిల్లాల ప్రధాన నాయకత్వంపై ,ప్రత్యకించి ప్రస్తుత ఖమ్మం జిల్లాలో ఆయన సహకారంతో పార్టీలో చేరి పదవులు అనుభవిస్తూ,వందల కోట్లు సంపాదిస్తూ తమ్మినేని పేరు చెప్పుకొని నాయకులుగాచలామణి అవుతూ,పార్టీని బలహీనపరుస్తూ రివిజనిస్ట్ ధోరణిలో పార్టీని నడిపిస్తున్న ప్రధాన రివిజనిస్ట్ నాయకత్వంపై అభిశంసనా ఎందుకు ఉండదు ? అసలు ఖమ్మం జిల్లాలో సిపిఎం పార్టీ బలపడడానికి తమ్మినేనివే కారణం,బలహీనపడడానికి కూడా తమ్మినేనివే కారణం అనేది నిజమే, అంతే కాకుండా ఖమ్మం జిల్లా సిపిఎం పార్టీలో ఒక చర్చ ఉంది “నిప్పుకు చెదలు” బ్యాచ్ పార్టీకి బాగా నష్టం చేసిందని కానీ అది వాస్తవం కాదు, ప్రజలలో పనిచేసి, జనాదరణ ఉన్న మాస్ లీడర్స్ పార్టీకి దూరం కావడం, పార్టీ బలహీన పడటానికి ప్రధాన కారణం తమ్మినేని సపోర్ట్ తో పార్టీలో చేరిన ఈ రివిజనిస్టులే,వీరి సారథ్యంలో సిపిఎం పార్టీ పూర్తిగా గ్రూప్ రాజకీయాలు,వ్యక్తీ పూజ ధోరణులతో పూర్తిగా బూర్జువా పార్టీలాగా మారిపోయిందని, అనేక మంది ఉన్న మంచి నాయకులను,క్యాడర్ ను కూడా కోల్పోయింది అనేది సిపిఎం కార్యకర్తలో, రాజకీయ విశ్లేషకులలో,ప్రజలలో జరుగుతున్న చర్చ,ఇప్పటికైన ఖమ్మం జిల్లాలో ఈ రివిజనిస్టులు చేతులో,వారికి మద్దతుగా నిలుస్తున్న రాష్ట్ర నాయకత్వం చేతుల నుండి గ్రూప్,కుల రాజకీయాల నుండి పార్టీనీ ఇంకా బలహీనపడకుండా వారి నుండి పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత నికార్సైన ప్రతి సిపిఎం కార్యకర్త బాధ్యత…
విప్లవ అభినందనలతో….
మీ CPM నికార్సైన కార్యకర్త.ఖమ్మం జిల్లా
