జనం ముచ్చట, హైదరాబాద్:
సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, సీపీఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంపై కేంద్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీకి పంపించిన అభిశంసన లేఖ పూర్తి పాటవం….
ప్రియమైన కామ్రేడ్ !!
కేరళలోని తిరువనంతపురంలో 2026 జనవరి 16 నుండి 18 వరకు జరిగిన సమావేశంలో పార్టీ కేంద్రం కమిటీ నిర్ణయించిన లేఖను పంపిస్తున్నాం,ఈ లేఖను శాఖ స్థాయి వరకు వివరించాలి…..
దేశంలోని పార్టీ శాఖల్లో ఒక ముఖ్యమైనది తెలంగాణా శాఖ. బిజెపి-ఆరెస్సెస్ హిందూత్వ మతోన్మాద శక్తులను ఒంటరిపాటు చేసి, ఓడించడం, పార్టీ, వర్గ, ప్రజాసంఘాల స్వతంత్ర రాజకీయ, సంస్థాగత బలాన్ని పెంపొందించడం అనే పార్టీ 24వ మహాసభ నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చడంలో ఈ శాఖ గుర్తించదగిన పాత్ర వహించాల్సి ఉంది.
కాని గత కొన్నేళ్ళుగా తెలంగాణా శాఖను తీవ్రమైన రాజకీయ, నిర్మాణ సమస్యలు ఆవరించి ఉన్నాయి. వాటిని సరిదిద్దేందుకు పదే పదే ప్రయత్నించినప్పటికీ అవి కొనసాగుతూనే ఉన్నాయి. జనవరి 2025లో సంగారెడ్డిలో జరిగిన రాష్ట్ర మహాసభలో ఇవి తారాస్థాయికి చేరాయి. అవి పార్టీ ఆలిండియా మహాసభలో కూడ ప్రతిబింబించాయి. కొన్ని జిల్లా పార్టీ మహాసభల్లో సైతం తీవ్రమైన పెడ ధోరణులు వ్యక్తమయ్యాయని రిపోర్టు చేయబడింది. ఈ సమస్యలను చేపట్టి, తప్పుడు ధోరణులను సరిచేసి, నిర్మాణానికి పదునుపెడితే తప్ప, పార్టీ ముందున్న కర్తవ్యాలను సమర్ధవంతంగా నెరవేర్చలేము. పార్టీ, ప్రజాసంఘాల బలోపేతం కూడ సాధ్యం కాదు. ఈ సమస్యల తీవ్రత దృష్ట్యా తెలంగాణ పార్టీకి ఈ లేఖ రాయాలని కేంద్రకమిటీ భావించింది. తెలంగాణ పార్టీలోని పొరపాటు ధోరణులు, అభిప్రాయాలను, నిర్మాణ లోపాలను స్పష్టం చేస్తూ ఈ లేఖ రాయబడింది. పార్టీ 24వ ఆలిండియా మహాసభ తన నిర్మాణ నివేదికలో ఇలా పేర్కొంది, “తెలంగాణ పార్టీ రాష్ట్ర మహాసభలో కొన్ని అనారోగ్యకర ధోరణులు గుర్తించబడినాయి. పార్టీ ఆలిండియా మహాసభ అనంతరం ఈ సమస్యను చేపట్టడం జరుగుతుంది.” ఈ ఆదేశానికి కొనసాగింపుగా, పార్టీ రాష్ట్ర మహాసభల తీరును సమీక్షించడానికి రాష్ట్ర సెక్రటేరియట్, రాష్ట్రకమిటీ సమావేశాలు, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి, పొలిట్ బ్యూరో సభ్యులు ఎ విజయ రాఘవన్, బివి రాఘవులు సమక్షంలో మే 14-16 తేదీల్లో జరిగాయి. దీని గురించి, జూన్లో జరిగిన కేంద్రకమిటీకి సమర్పించిన పిబి వర్క్ రిపోర్టులో ఇలా పేర్కొన బడింది, “పార్టీ నిర్మాణంలో కొనసాగుతున్న అనారోగ్యకర వాతావరణాన్ని ఈచర్చలు వెల్లడించాయి. పార్టీ మహాసభ నిర్ణయించిన విధంగా, పొలిట్ బ్యూరో ఈ సమస్యలను చేపట్టి, పార్టీలో ఐక్యతను పునర్నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.” దానికి అనుగుణంగా, ఈ సమస్యలపై రాష్ట్ర సెక్రటేరియట్, రాష్ట్ర కమిటీ సభ్యుల అభిప్రాయాలను అర్ధం చేసుకోవడానికి, మరొక దఫా రాష్ట్ర సెక్రటేరియట్, రాష్ట్ర కమిటీ సమావేశాలకు హాజరు కావలసిందిగా, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం ఏ బేబి, ముగ్గురు పొలిట్ బ్యూరో సభ్యులు ఎ విజయ రాఘవన్, శ్రీదీప్ భట్టాచార్య, బివి రాఘవులును పార్టీ నియమించింది.
వారి నివేదిక ఆధారంగా, 2025 అగస్టు 18న జరిగిన పిబి సమావేశం, తెలంగాణ పార్టీలోని అనారోగ్యకర వాతావరణంపై దర్యాప్తు జరిపేందుకు పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీదీప్ భట్టాచార్య, కె బాలకృష్ణన్లతో ఒక ద్విసభ్య కమిషన్ను పంపించాలని నిర్ణయించింది,ద్విసభ్య కమిషన్ లోతైన పరిశీలన తర్వాత తన నిర్ధారణలు, సూచనలతో కూడిన నివేదికను సమర్పించింది. తీవ్రస్థాయిలో జరిగిన ఉల్లంఘనలకు ఆనాటి రాష్ట్రకార్యదర్శి ప్రధానంగా బాధ్యుడని కమిషన్ నిర్ధారించింది. మరో ఇద్దరు రాష్ట్రకమిటీ సభ్యులు కూడా తప్పు చేశారని తేల్చింది. 2026 జనవరి 16నుండి 18 వరకు తిరువనంతపురంలో జరిగిన పార్టీ కేంద్రకమిటీ ఈ నివేదికను పరిశీలించింది…..
రాజకీయ నిర్మాణంలో పెడ ధోరణులకు కారణం ఏమిటి?
కేంద్రకమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కమిటి సభ్యులు స్కైలాబ్ బాబు, బి. ప్రసాద్లు ఇచ్చిన వివరణలు అసమగ్రంగా ఉన్నాయని,వాటిలో ఆత్మ విమర్శ లోపించిందని భావించిన కేంద్ర కమిటీ, నిర్మాణానికి సంబంధించి తగని విధంగా ప్రవర్తించిన ఈ కామ్రేడ్స్పై క్రమశిక్షణా చర్య తీసుకున్నది. ఈ ముగ్గురు కామ్రేడ్స్ ను అభిశంసించింది. కామ్రేడ్ వీరభద్రాన్ని రాష్ట్రసెక్రటేరియట్ మరియు కమిటీ సమావేశాలలో పరిశీలకునిగా నడుచుకోవాలని, రాష్ట్ర సెక్రటేరియట్ డైరక్షన్లో పనిచేయాలని, కేంద్ర కమిటీ ఆదేశించింది. ఈ కామ్రేడ్స్ తమ పొరపాట్లను గుర్తించి, సరిచేసుకునేందుకు,దోహదపడతాయన్న ఉద్దేశంతో ఈచర్యలు తీసుకోబడ్డాయి,పార్టీలోని ప్రతి ఒక్కరు దీన్ని ఒక హెచ్చరికగా తీసుకొని, పార్టీలోపల జరిగే రాజకీయ, నిర్మాణపరమైన పొరపాట్ల పట్ల
అప్రమత్తంగా వ్యవహరించాలి,పార్టీ రాష్ట్ర మహాసభలోను, కొన్ని జిల్లా మహాసభల్లోను నాయకత్వ స్థాయిలో వ్యక్తమయిన అనైక్యత, ముఠాతత్వాల తీవ్రతను గుర్తించిన కేంద్ర కమిటీ తెలంగాణ పార్టీకి లేఖ రాయాలని నిర్ణయించింది.తెలంగాణ పార్టీ నాయకత్వంలోని రాజకీయ, నిర్మాణ లోపాలను, పెడధోరణులను, ఈ సమస్యలకు మూల కారణాలను కేంద్ర కమిటీ ఈ లేఖ రాస్తున్నది.
ఈ లేఖ లక్ష్యం:
పార్టీ శ్రేణులను ఎడ్యుకేట్ చేసి, వారి చైతన్యాన్ని పెంపొందించడం, గుర్తించి, నాయకత్వంలో కొనసాగుతున్న చూసిచూడనట్లు పోయే వైఖరి పట్ల, అన్ని స్థాయిల్లో పార్టీని అప్రమత్తం చేసేందుకు ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ, నిర్మాపరమైన లోపాలు, సంస్థాగత అనైక్యతల తీవ్రతను గుర్తించేలా చేయడం, అలాంటి పెడధోరణులపై పోరాటం చేసేలా, ప్రస్తుతం బలహీనతలను అధిగమించేలా సన్నద్దం చేయడం.
తీవ్రమైన నిర్మాణ అనైక్యత….
పార్టీ గత రాష్ట్ర మహాసభ సమయంలో అనేక అభ్యంతరకరమైన, అనంగీకారమైన ధోరణులు, ప్రత్యేకించి నూతన రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకునేప్పుడు అత్యంత తీవ్రమైన రూపంలో కనిపించాయి. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించబడింది. ప్రజాతంత్రయుతమైన చర్చ, ఏకాభిప్రాయ సాధన స్థానంలో లాబీయింగ్, ప్రలోభాలు, అస్తిత్వవాద అప్పీళ్ళు చోటుచేసుకున్నాయి…..
పార్టీ ప్రమాణాలు గాలికి వదిలి వేయబడినాయి….
పార్టీ రాష్ట్ర మహాసభను సమీక్షించిన రాష్ట్రకమిటీ సమావేశంలో చాలమంది సభ్యులు అప్పటి లాబీయింగ్ పట్ల, గుసగుసల పట్ల, తెరవెనుక జరిగిన మంత్రాంగం పట్ల, ప్రచారం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.అలాంటి ప్రవర్తనకు సీనియర్ నాయకులే పాల్పడటం ఇంతకు ముందెన్నడూ జరగలేదు, అది పార్టీ సంప్రదాయాలకు, రాజకీయ సంస్కృతికి పూర్తి విరుద్ధమైనది,పార్టీ మహాసభకు ముందు, మహాసభ సమయంలోను నాయకత్వంలో ఉన్న తీవ్రమైన చీలికలు సెక్రటేరియట్, రాష్ట్ర కమిటీ సమావేశాల్లో స్పష్టంగా వ్యక్తమయ్యాయి. నాయకత్వం లోతుగా చీలిపోయిఉంది. ఈ అనైక్యత పైపైన లేదు, విస్తృతంగాను, లోతుగా వేళ్ళూనుకొని ఉంది. పార్టీ కార్యకలాపాల సమీక్ష సమయంలోను, బాధ్యతల కేటాయింపు సమయంలో కూడ ఈ చీలికలు వెల్లడయ్యాయి. మహాసభ సమయంలోని పరిణామాల పర్యవసానం రాష్ట్ర నాయకత్వపు రోజువారీ పనిపై కూడ ప్రభావం చూపుతున్నది. ఇది పరిస్థితి తీవ్రతను నొక్కిచెబుతున్నది,రాష్ట్ర కమిటీ సభ్యుల్లో ఒక భాగం పార్టీ సమిష్టి ప్రయోజనాలు, సూత్రాలకన్నా మిన్నగా, వ్యక్తిగత ఆకాంక్షలతోను, తమకు నచ్చినట్లుగాను, అస్తిత్వ రాజకీయాల తోను, వ్యక్తిగత, ముఠా ప్రయోజనాలతోను వ్యవహరిస్తున్నారని కూడ చర్చల్లో వెల్లడయింది. అస్తిత్వాలను, సెంటిమెంట్లను దుర్వినియోగపరచడంతో సహా, సూత్రరహితమైన బూర్జువా పద్ధతులను అనుసరించడానికి వారు వెనకాడటం లేదు. ఈ తప్పుడు ధోరణి రాష్ట్ర మహాసభ సమయంలో జరిగిన పరిణామాల్లో స్పష్టంగాను, మరింత బలంగాను వెల్లడయ్యాయి…..
ముఠాతత్వం, ప్రమాణాల ఉల్లంఘన….
నూతన రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక ప్రక్రియ సమయంలో ముఠాతత్వం ఆందోళనకర స్థాయికి చేరింది. పరిస్థితి తీవ్రతను, అనారోగ్యకరమైన నిట్టనిలువుగా చీలిన వాతావరణాన్ని గుర్తించిన పొలిట్ బ్యూరో సభ్యులు ఐక్యతను నెలకొల్పడానికి తీవ్రంగా, పదే పదే ప్రయత్నించారు. పార్టీ ఐక్యత, క్రమశిక్షణ పరిరక్షణ కోసం, ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయవలసిందిగా కేంద్రకమిటీ సభ్యులకు, సెక్రటేరియట్ సభ్యులకు వారు సలహా ఇచ్చారు,కాని ఎన్నిసార్లు అప్పీలు చేసినప్పటికీ, అప్పటి రాష్ట్ర కార్యదర్శితో సహా పార్టీ నాయకత్వంలోని ఒక సెక్షను ఇలాంటి వైఖరిని మొండిగా తిరస్కరించారు, వెనక్కి తగ్గేందుకు అంగీకరించలేదు,ఫలితంగా, ఏకాభిప్రాయాన్ని ఏర్పరిచి,పార్టీ ఐక్యతను నిలబెట్టేందుకు పొలిట్ బ్యూరో సభ్యులు చేసిన ప్రయత్నాలు అంతిమంగా విఫలమయ్యాయి. మొత్తంగా పార్టీ సమిష్టి ప్రయోజనాల కన్నా మిన్నగా, ఒక భాగం, ముఠా ప్రయోజనాలను పైకి తెచ్చేందుకు జరిగిన ఉద్దేశపూర్వక ప్రయత్నాన్ని ఇది ప్రతిబింబిస్తున్నది. ఇది అంతర్గత చీలికల లోతునే కాకుండా, నాయకత్వంలోని ఒక భాగంలో వున్న రాజకీయ రహిత, బాధ్యతలేని వైఖరిని కూడ ఇది స్పష్టం చేస్తున్నది,అలాంటి ప్రవర్తన పార్టీ ఐక్యతను, క్రమశిక్షణను, ప్రజాతంత్ర పనివిధానాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. పార్టీ సమిష్టి ప్రయోజనాలకన్నా ఎక్కువగా ముఠా అంశాలకు ప్రాధాన్యతనిచ్చే ఈ చర్యలు ప్రమాణాలు దిగజారడానికి, నిర్మాణ అనైక్యత తీవ్రం కావడానికి నేరుగా దోహద పడ్డాయి.
కొనసాగుతున్న అస్తిత్వవాద రాజకీయాల ప్రభావం….
పార్టీ రాష్ట్ర మహాసభ సాగుతున్న సమయంలో అస్తిత్వవాద సమీకరణలు బహిరంగంగా వ్యక్తమయ్యాయి. సెక్రటేరియట్, రాష్ట్ర కమిటీ సమావేశాల చర్చల్లో సైతం ఈ వైఖరి ప్రతిబింబించింది. అంతకు ముందు అస్తిత్వవాద రాజకీయాల వైపుగా ఉన్న ధోరణి, మరింత అధ్వాన్నంగా మారి, రాష్ట్ర మహాసభ కాలంలో కుల ప్రాతిపదికన చర్చలకు, ప్రచారానికి దారితీసింది. కుల పరిగణనలు రాజకీయ చర్చలను గుర్తించదగిన రీతిలో ప్రభావితం చేశాయి.
ఒక విప్లవాత్మక, కార్మికవర్గ పార్టీలో ఇవి సహించరానివి….
ఆ విధంగా అస్తిత్వవాద రాజకీయాలు దిగజారడం, బహిరంగ కులతత్వం, వర్గ దృష్టితో పనిచేసే ఒక విప్లవ సంస్థ సిద్ధాంతం, ఆచరణలతో ఎంతమాత్రం పొసగనివి,ఇదేమీ కొత్త పరిణామం కాదు. తెలంగాణా పార్టీ పనితీరును అస్తిత్వ రాజకీయాలు తీవ్రంగా ప్రభావితం చేయడం మొదలైన 2017లోనే పొలిట్ బ్యూరో జోక్యం చేసుకొని రాష్ట్ర పార్టీకి ఒక లేఖ రాయడం ద్వారా ఈ పెడధోరణిని సరిచేయడానికి ప్రయత్నించింది, అస్తిత్వ రాజకీయాల ప్రభావం నాయకత్వ స్థాయిలోనే బలంగా కొనసాగడాన్ని గమనించిన పొలిట్ బ్యూరో తెలంగాణ పార్టీకి ఆ తర్వాత మరొక లేఖ రాసింది. పార్టీ నాయకత్వ సెక్షన్లలో కొనసాగుతున్న పొరపాటు ఆలోచనను ఆ లేఖ స్పష్టంగా వివరించింది. ఈ లేఖల తర్వాత పార్టీ సూత్రబద్ధమైన సైద్ధాంతిక వైఖరిని వివరించడానికి కేడరు సమావేశాలు ఏర్పాటు చేయబడినాయి,ఇలా పొలిట్ బ్యూరో పదే పదే ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ పెడ ధోరణి కొనసాగి, బహిరంగంగా అస్తిత్వవాద ప్రచారపు రూపుదాల్చిందని, ఇటీవలి పార్టీ రాష్ట్ర మహాసభలో జరిగిన పరిణామాలు స్పష్టం చేశాయి. ఇది తీవ్రమైన సైద్ధాంతిక, రాజకీయ వెనుకబాటును వెల్లడిస్తున్నది,ఈ పెడధోరణి పర్యవసానం ఇంకా వెన్నాడుతూనే ఉందని రాష్ట్ర మహాసభ అనంతర పరిణామాలు, చర్చలు తెలియచేస్తున్నాయి. అందుచేత, తక్షణం, స్థిరమైన సైద్ధాంతిక, రాజకీయ జోక్యం చేసుకోవలసిన అవసరం ఏర్పడింది. రానున్న రోజుల్లో అస్తిత్వవాద రాజకీయాలను నిర్మూలించి, పార్టీ వర్గ ప్రాతిపదిక రాజకీయాలను బలంగా పునరుద్ఘాటించే లక్ష్యంతో పొలిట్ బ్యూరో ఈ సమస్యను తీసుకొని ఒక తీవ్రమైన, క్రమబద్ధమైన శిక్షణను చేపట్టాల్సి వుంది…..
తప్పుడు రాజకీయ దృక్పథం – ఫెడరల్ ధోరణులు….
తెలంగాణ పార్టీ నాయకత్వం ప్రతిపాదిస్తున్న రాజకీయ విధానం, పార్టీ రాజకీయ, ఎత్తుగడల విధానానికి భిన్నంగా ఉ ంది. పార్టీ ఆలిండియా మహాసభలో తెలంగాణ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ చేసిన విమర్శలో, ప్రత్యేకించి ఎన్నికల ఎత్తుగడల అంశంలో ఇది స్పష్టంగా వ్యక్తమయింది. అంతకు ముందు రాష్ట్ర మహాసభలో అప్పటి రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర నివేదికను ప్రవేశపెడుతూ పార్టీ లైన్ పట్ల తన అనంగీకారాన్ని బహిరంగంగా వ్యక్తం చేశాడు,అంతేకాకుండా, కేంద్రకమిటీలో కాని, పిబి వద్ద కాని ఎన్నడూ లేవనెత్తకుండా, రాష్ట్ర మహాసభ నివేదికలో పొలిట్ బ్యూరో పాత్రలో కూడ బలహీనతలు ఉన్నాయని ఏకపక్షంగా పేర్కొనబడింది.ఈ అంశాలు పార్టీ రాజకీయ ఎత్తుగడల విధానాన్ని అర్ధం చేసుకోవడంలో తీవ్రమైన పొరపాటు ఉందని చెప్పడమే కాకుండా, ఫెడరల్ ధోరణులను, నిర్మాణ రాహిత్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ బాధ్యత లోపించడాన్ని, నిర్మాణపరమైన పరిపక్వత లేకపోవడాన్ని అవి సూచిస్తున్నాయి. ఆ విధంగా, తీవ్రమైన రాజకీయ, సైద్ధాంతిక దిద్దుబాటు అవసరాన్ని అవి నొక్కిచెబుతున్నాయి…..
తరిగిపోయిన పార్టీ విలువలు….
పార్టీ రాష్ట్ర మహాసభలో కనిపించిన అనారోగ్యకర పరిణామాలు నేరుగా, ఒక భాగం పార్టీ నాయకత్వంలో ఉన్న ఉ దారవాద ఫలితమే. పొరపాటు ధోరణులను సహించడంలో మాత్రమే కాదు, కమ్యూనిస్టు నిర్మాణ ప్రమాణాల ఉల్లంఘనను బహిరంగంగా ముందుకు తీసుకువెళ్లడంలోను, ప్రోత్సహించడంలోనూ ఈ ఉదారవాదం వ్యక్తమయింది,నాయకత్వంలోని ఈ ఉదారవాద ధోరణి పార్టీ పనితీరుపై అనేక విధాలుగా ప్రతికూల ప్రభావం చూపింది. ఫలితంగా అది క్రమశిక్షణ ఉల్లంఘనకు, కమ్యూనిస్టు విలువలు, నైతికత పంచబడటానికి, అవినీతికర చర్యలు వ్యాపించడానికి దారితీసింది. అది క్రమశిక్షణను అమలు చేయడాన్ని బలహీన పర్చింది, నిర్మాణ ప్రమాణాలను దిగజార్చింది, అనైతిక ప్రవర్తనలను, ఆర్థిక అవకతవకలను సహించే వాతావరణాన్ని సృష్టించింది….
ఈ ధోరణులు అంతకు ముందే…..
ఎన్నికల సమీక్ష నివేదికలోనే స్పష్టంగా గుర్తించబడినాయి. రెండు జిల్లా కమిటీల నాయకత్వం బూర్జువా పార్టీల నుండి నిధులు సేకరించినపుడు, ఈ తీవ్రమైన రాజకీయ తప్పిదాన్ని రాష్ట్ర సెక్రటేరియట్ ఆషామాషీగా తీసుకుంది. క్రమశిక్షణా ను కేంద్ర కమిటీ ఆమోదం కోసం సేవమాడకుండానే అమలు చేసి నాయకత్వం రాష్ట్ర కమిటీకి లేఖ ద్వారా ఈ తీవ్రమైన లోకి చూసింది. ఈ లేఖ జిల్లా కమిటీ స్థాయి వరకు ప చేయబడింది. ఈ తప్పుడు ధోరణుల పట్ల రాష్ట్ర నాయకత్వ మామాలు పైన పార్టీ నియమాలను గట్టిగా పరిరక్షించడంలో వారి వైఫల్యం పైన ఈ లేఖ అని ఆందోళన వ్యక్తం అయింది…..
లేఖలో పొలిట్ బ్యూరో హెచ్చరించింది ఇలా….
“పార్టీకీయ విధానాన్ని, నిర్మాణ రూపాలను తీవంగా ఉల్లంఘించడం పట్ల, రాష్ట్ర సెక్రటేరియట్ అనుసరించిన ఉదారవాద దృక్పదాన్ని ఇది ప్రతిబింబిస్తున్నది. దీనిపై సెక్రటేరియట్ అక్కన ఉందో రాష్ట్ర కమిటీ గుర్తించాలి. తప్పుడు ధోరణులను- వారి లోపల అన్యవర్ణ ధోరణుల చెడు ప్రభావాన్ని తీవ్రంగా చేసుకోవాలి. పార్టీ నిర్మాణం ఎలాంటి తీవ్ర స్థితిలో ఉంటే, పార్టీ శ్రేణుల్లో రాజకీయు. సైద్ధాంతిక స్థాయి ఎంతటి లోప తీసుకోవాలి. అలాంటి తప్పుడు ధోరణులను, అవరణలను కరిష్టంగా గుర్తించి, అలాంటి కమ్యూనిస్తోతర అనారోగ్యకర కార్యకలాపాలకు ఎవ్వరూ పాల్పడకుండా, మొత్తం పార్టీని చైతన్యవంతం చేయడానికి, ఒక క్రమబద్ధమైన పోరాటాన్ని నిర్వహించాలి.”…..
ఐక్యతను కేవలం ఆకాంక్షిస్తేనే చాలదు….
సెక్రటేరియట్లోను, రాష్ట్ర కమిటీలోను జరిగిన చర్చలన్ని టిలో సభ్యులు ఐక్యత కోసం పనిచేస్తామని వాగ్దానం చేశాడు. ప్రతిన బూనారు. ఈ బలహీనతలను అధిగమించి పార్టీ సమైక్యంగా ముందుకు సాగాలని తమ దృరమైన ఆకాంక్షను వ్యక్తం చేశారు. కాని, నిజమైన ఐక్యతను సాధించాలంటే, కేవలం ఆలా జరగాలన్న కోర్కె కలిగి ఉండటం, దాన్ని ప్రకటించడం మాత్రమే సరిపోదు. ఐక్యతను సాధించాలంటే, గత పొరపాటు, తప్పుడు ధోరణుల మూల కారణం ఏమిటి అన్న దానిపై స్పష్టమైన, చిత్తశుద్ధితో కూడిన, సమిష్టి అవగాహన, దానితో పాటు వాటిని సరిద్దుకోవాలన్న దృఢ నిబద్ధత అవసరం,రాష్ట్ర సెక్రటేరియట్, రాష్ట్ర కమిటీలు ముందుకు వచ్చి, ఐక్యతను ఆచరణలో సాధించాలన్న తమ దృఢ సంకల్పాన్ని పార్టీ శ్రేణులకు విశ్వాసం కలిగేలా చూపెట్టాలి. లోపాలను సరిచేసుకోవడానికి కూలంకష్టమైన దిద్దుబాలు క్రమాన్ని ఆరంభించాల్సిన బలమైన సైద్ధాంతిక, నిర్మాణ పునాదిపైన ఐక్యతను నిర్మించాల్సిన బాధ్యత పూర్తిగా సెక్రటేరియట్, రాష్ట్ర కమిటీలపైనే ఉంది. గత ఘన చరిత్ర స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర కమిటీ శిలాసదృశమైన ఐక్యతను సాధించి, దృఢంగా ముందుకు సాగుతుందన్న విశ్వాసం కేంద్ర కమిటీకి వుంది,ముఠా తత్వాన్ని అధిగమించి, ఐక్యతను పటిష్టం చేసేందుకు చర్యలు.సెక్రటేరియట్: రాష్ట్ర కమిటీ సభ్యులందరూ పార్టీ ఐక్యతను బలోపేతం చేసేందుకు చైతన్యయుతంగా, వికరంగా కృషి చేయాలి. ప్రత్యేకించి సెక్రటేరియట్, రాష్ట్ర కమిటీ నాయకత్వంలో కామ్రేడ్లీ సంబంధాలు, పరస్పర విశ్వాసాలను నెలకొల్పేలా వారు సమిష్టిగా పనిచేయాలి,రాష్ట్ర కార్యదర్శి తన బాధ్యతలను సమర్ధవంతంగాను, స్వతంత్రంగాను నిర్వర్తించాలి. రాష్ట్ర కేంద్రంలోను, సెక్రటేరియల్లోను, రాష్ట్ర కమిటీలోను సమిష్టి పనివిధానాన్ని నెలకొల్పాల్సిన బాధ్యత రాష్ట్ర కార్యదర్శిడే అందుబాటులో ఉన్న సెక్రటేరియట్ సభ్యులతో రోజువారీ సమావేశాలు నిర్వహించాలి. పూర్తి సెక్రటేరియట్ సమావేశాల మధ్యలో, రాష్ట్ర కేంద్రంలోని సెక్రటేరియల్ సభ్యుల సమావేశాలను క్రమబద్ధంగా నిర్వహించాలి. నిర్ణయాలను సమిష్టిగా మాత్రమే తీసుకోవాలి. వ్యక్తిగతమైన, స్వీయమానసిక ధోరణితో కూడిన, ముఠా ధోరణితో కూడిన, ఏకపక్షమైన పనివిధానాన్ని అనుమతించరాదు,నిర్మాణ సూత్రాలను,పార్టీ నిబంధనావళిని తుచ తప్పకుండా, కచ్చితంగా పాటించాలి:. ఫెడరల్ ధోరణులను, బూర్జువా పద్ధతులను, ఏ రకమైన వ్యక్తిగతమైన ద్వేషాలను, కక్షసాధింపు ధోరణిని, ముఠా తగాదాలను ప్రత్యేకించి నాయకత్వ స్థాయిలో- దృఢంగా తిరస్కరించాలి.సరైన సిద్ధాంతం, రాజకీయాలతో మొత్తం పార్టీకి క్రమపద్ధమైన శిక్షణ అందించాలి. ఎలాంటి సైద్ధాంతిక, రాజకీయ పెడధోరణిని అయినా, ప్రత్యేకించి అది పార్టీలోపల ప్రచారంలో పెట్టబడుతున్నపుడు, దాన్ని వెంటనే గుర్తించి పోలిట్ బ్యూరో సహాయం, మార్గదర్శకత్వాలతో సరిదిద్దుకోవాలి. పొరపాటు చేస్తున్న కామ్రేడ్లు, ప్రత్యేకించి నాయకత్వ స్థానాల్లో ఉన్న వారయితే, ఆలస్యం చేయకుండా వాటిని సరిదిద్దుకునేందుకు సహాయపడాలి…..
రాష్ట్రంలోని పార్టీ సభ్యులందరూ కచ్చితంగా పార్టీ లైన్ బ్రకారం గైడ్ చేయబడాలి. పనిచేయాలి:
ప్రస్తుతం తెలంగాణాలో ఉన్న పరిస్థితి దృష్ట్యా, ఒక నమ్ముమైన, తీవ్రమైన దిద్దుబాటు క్రమాన్ని పార్టీ నాయకత్వం చేపట్టాలి. ఈ దిద్దుబాటు పార్టీ కార్యక్రమంపైన, పార్టీ 24వ మహాసభలో ఆమోదించిన రాజకీయ విధానంపైన ఆధారపడి, పొలిట్ బ్యూరో మార్గదర్శకత్వంలో జరగాలి.
-కేంద్ర కమిటీ, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు)….
అభివందనములతో,
(ఎం.ఎ.బేబీ), ప్రధాన కార్యదర్శి
సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
