బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసు మిస్టరీని చేదించిన పోలీసులు!!

Pathi Sreenivas Rao
4 Min Read

ఈ నెల పదిహేనవ తారీఖున పాలేరు రిజర్వాయర్ లో అనుమానాస్పదంగా మృతి చెందిన నంద్యాల జిల్లా, నందికొట్కూరు మండలం, అల్లూరు గ్రామానికి చెందిన, ప్రముఖ యూట్యూబర్, రచయిత, విమర్శకుడు బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసు మిస్టరీనీ కూసుమంచి పోలీసులు చేధించారు,ఈ సందర్భంగా ఈరోజు రూరల్ ఎసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ ఎసిపి బిల్లా తిరుపతి రెడ్డి హత్య కేసు పూర్వాపరాలను వివరించారు, మృతుడు శ్రీనివాస్ అతని స్నేహితుడు మేకల వేణుమాధవ్ రెడ్డి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలే హత్యకు దారితీసాయని,ఈ కేసులో నిందితులైన A1 మేకల వేణుమాధవ్ రెడ్డి,A2 పోకల కోటేశ్వరరావు,A3 షేక్ అబ్దుల్ హఫీజ్,A4 యం.డి అజ్మత్ అలీ ఖాన్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు…..

వివరాల్లోకి వెళితే మృతుడు బొగ్గుల శ్రీనివాస్ గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పరచుకుని నివసిస్తున్నాడు,
ఈ క్రమంలో కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ప్రధాన నిందితుడు మేకల వేణు మాధవ రెడ్డితో పరిచయం ఏర్పడింది,అప్పటికే బొగ్గుల శ్రీనివాస్ BOGGULA BBQ పేరుతో GST లైసెన్స్ ఉండడంతో,మేకల వేణుమాధవ్ రెడ్డి కూడా సొంతంగా “మేకా ప్రాజెక్ట్స్” పేరుతో కంపెనీ పెట్టీ సబ్ కాంట్రాక్టర్ గా పని చేయు చున్నాడు,ఈ నేపథ్యంలో బొగ్గుల శ్రీనివాస్ కు చెందిన BOGGULA BBQ పేరు మీద ఫేక్ ఇన్వాయిస్ అండ్ సెల్స్ ఫైల్ చేసి మంచి లాభాలు సంపాదించ వచ్చని మేకల వేణుమాధవ్ రెడ్డి చెప్పగా శ్రీనివాస్ దానికి ఒప్పుకుని తన లైసెన్స్ ఉపయోగించుకున్నందుకు వచ్చిన లాభంలో యాభై శాతం ఇచ్చేలాగా వేణుమాధవ్ రెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నాడు,….

ఈ దరిమిలా 2022 నుండి 2025 వరకు GST ఫైలింగ్ తో దాదాపు తొంబై లక్షల రూపాయలు సంపాదించారు,అందులో శ్రీనివాస్ వాటా నలబై ఐదు లక్షలు కాగా పదిహేను లక్షల రూపాయలు శ్రీనివాస్ కు వేణుమాధవ్ రెడ్డి ఇవ్వడం జరిగింది,మిగతా ముప్పై లక్షల రూపాయలు ఆర్థిక ఇబ్బందులు కారణంగా ప్రస్తుతం ఇవ్వలేక పోతున్నానని త్వరలో ఇస్తానని చెప్పాడు,ఇదే క్రమంలో GST మోసానికి సంబంధించి వేణుమాధవ్ రెడ్డి మరియు మృతుడు శ్రీనివాస్ కు GST డిపార్ట్మెంట్ నుండి నోటీసులు రావడం, శ్రీనివాస్ యొక్క BOGGULA BBQ లైసెన్స్ రద్దు చేయడంతో తనకు చెల్లించాల్సిన ముప్పై లక్షలతో పాటు రద్దయిన GST లైసెన్సును పునరుద్ధరణ చేయమని వేణుమాధవ్ రెడ్డినీ కోరగా GST లైసెన్సును పునరుద్ధరణ చేయాలంటే దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఆది నావల్ల కాదని వేణుమాధవ్ రెడ్డి స్పష్టం చేయడంతో వారిద్దరి మధ్య వివాదాలు తలెత్తాయి…..

తనకు రావాల్సిన ముప్పై లక్షలు,లైసెన్స్ పునరుద్ధరణ కోసం మృతుడు తీవ్రంగా ఒత్తిడి చేస్తుండటంతో అసలే ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న వేణుమాధవ్ రెడ్డి కోటి రూపాయలు ఎలా కట్టాలో అర్థంకాక ఎలాగైనా బొగ్గుల శ్రీనివాస్ ను అంతమొందించి డబ్బులు ఎగ్గొట్టేయాలని కుట్ర పన్నాడు,ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన పోకల కోటేశ్వరరావు,షేక్ అబ్దుల్ హఫీజ్,యం.డి. హజ్మత్ అలీ ఖాన్లతో అయిదు లక్షల రూపాయలు సుఫారీ కుదుర్చుకుని శ్రీనివాస్ హత్యకు పథకం రచించాడు,పథకంలో బాగంగా ఈ నెల 13 వ తారీకు రాత్రి పెండింగ్ లో ఉన్న ముప్పై లక్షలు చెల్లిస్తామని నమ్మబలికి విజయవాడకు వెళదామని బొగ్గుల శ్రీనివాస్ ను వేణుమాధవ్ రెడ్డి కారులో ఎక్కించుకుని 14 వ తారీకు తెల్లవారుజామున నకిరేకల్ నుండి జనగాం వైపు వెళ్ళే దారిలో జన సంచారం లేని ప్రదేశంలో నిందితులు శ్రీనివాస్ పై కత్తులు, ఇనుపరాడ్లతో మృతుని తలపై దాడిచేసి హత్య చేశారు…..

అనంతరం బొగ్గుల శ్రీనివాస్ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహంతో పాటు కారును పాలేరు రిజర్వాయర్లో తోసేశారు, సాంకేతిక ఆధారాలు,ఇతర సాక్ష్యాధారాల ఆధారంగా కేసును దర్యాప్తు చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించగా ఈ రోజు ఉదయం కోర్టులో ప్రవేశపెట్టినట్లు రూరల్ ఎసిపి బిల్లా తిరుపతి రెడ్డి మీడియాకు తెలిపారు,
ముఖ్యంగా ఘటన జరిగిన వెంటనే రూరల్ ఎసిపి బిల్లా తిరుపతి రెడ్డి స్పందించి కూసుమంచి సిఐ సంజీవ్ ను విచారణాధికారిగా నియమించి,సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు, నేలకొండపల్లి ఎస్సై సంతోష్,తిరుమలాయపాలెం ఎస్సై జగదీశ్, పిఏస్సై దివ్యలను నాలుగు బృందాలుగా ఏర్పాటు చేసి విచారణను వేగవంతం చేయడంతో తక్కువ వ్యవధిలోనే నిందితులను నిందితులను అరెస్ట్ చేశారు,కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన ఎస్సైలు జగదీశ్, సంతోష్,నాగరాజు,దివ్యలతో పాటు కానిస్టేబుళ్లు శోభన్, శ్రీకాంత్,సతీశ్, వినయ్,ఉదయ్,పూర్ణచందర్ రావు, శ్రీశైలం,శ్రీలత,సయ్యద్, సీతారాములు,హోంగార్డు రాంబాబులను ఎసిపి అభినందించారు…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment