బాధ్యతలు స్వీకరించిన ఏదులాపురం మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్!!

Pathi Sreenivas Rao
2 Min Read
మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్లుగా బాధ్యతలు స్వీకరించిన పోకబత్తిన అనిత,తమ్మినేని నవీన్ ....
Highlights
  • మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనిత,వైస్ ఛైర్మన్ గా తమ్మినేని నవీన్ బాధ్యతలు స్వీకరణ.....
  • ఏదులాపురాన్ని రాష్ట్రంలోనే ‘రోల్ మోడల్’గా తీర్చిదిద్దుతాం: మంత్రి పొంగులేటి....
  • వార్డుల్లో తిరగండి సమస్యలు తీర్చండి,ఫీల్డ్ లో ఉంటేనే వ్యవస్థ బాగుపడుతుంది....
  • వారంలో ఐదు రోజులు.. రోజుకు రెండు గంటలు ప్రజల్లో ఉండాల్సిందే కౌన్సిలర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దిశానిర్దేశం.....

ఏదులాపురం : ఆదివారం ఉదయంపె ద్దతండాలోని మున్సిపల్ కార్యాలయంలో నూతన మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత,వైస్ ఛైర్మన్ తమ్మినేని నవీన్ బాధ్యతల స్వీకార మహోత్సవానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు,ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొంగులేటి నూతన ప్రజాప్రతినిధులకు తనదైన శైలిలో దిశానిర్దేశం చేశారు.,ఎన్నికల వరకే రాజకీయం గెలిచిన తర్వాత ఏ పార్టీ వారైనా ప్రజా ప్రభుత్వం తరపున పేదవాడికి సేవ చేయాల్సిందేనని, పదవి అనేది అధికారం కాదు,బాధ్యత అని గుర్తించాలని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు….

ప్రజలు మనల్ని నమ్మి ఓటేశారని, కేవలం కుర్చీలకే పరిమితం కాకుండా నిత్యం క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశించారు అంతే కాకుండా ప్రతి కౌన్సిలర్ వారంలో ఐదు రోజులు, ఉదయం పూట రెండు గంటలు తప్పనిసరిగా వార్డుల్లో పర్యటించాలనీ,ప్రతి పనికి నిధులు అవసరం లేదు, మీరు బాధ్యతగా తిరిగితేనే అధికారులు,సిబ్బంది పనితీరు మెరుగుపడుతుందనీ అన్నారు,ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతానని,తాగునీటి సమస్యలు, మురికినీరు నిలవకుండా చూడటం, నాలాల కబ్జాలను అడ్డుకోవడంపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు,15 రోజుల్లో మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని,అప్పటికి ప్రతి వార్డు సమస్యపై కౌన్సిలర్లకు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు…..

అనంతరం సత్యనారాయణపురంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుడి గృహ ప్రవేశానికి మంత్రి పొంగులేటి హాజరయ్యారు,నూతన గృహంలోకి అడుగుపెట్టిన కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపి, ఆత్మీయంగా పట్టు వస్త్రాలను కానుకగా అందించారు.పేదల సంక్షేమమే ఈ ప్రభుత్వ ధ్యేయమని,అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్ , కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు……

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment