జనం ముచ్చట,ఖమ్మం జిల్లా :
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఏదులాపురం
గ్రామంలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల జియో టాగింగ్ కోసం తన సిబ్బందితో కలిసి బొమ్మకంటి లావణ్య అనే హౌసింగ్ ఆఫీసర్ (CCLTC,KMM) ఏదులాపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న సీపీఐ పార్టీ కార్యాలయంలో నీడ ఉన్నదనే ఉద్దేశ్యంతో అక్కడ కూర్చుని లబ్ధిదారులతో మాట్లాడుతుండగా అటుగా వస్తున్న సీపీఐ నాయకుడు,ఏదులాపురం మాజీ సర్పంచ్ చెరుకుపల్లి భాస్కర్ అక్కడ ఆగి నువ్వెందుకు మా ఆఫీసులో కూర్చున్నావు అంటూ ఆకరణంగా గొడవ పడుతూ హోసింగ్ ఆఫీసర్ పై చేయి చేసుకున్నట్లు స్థానిక ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో సదరు అధికారిని పిర్యాదు చేసింది. ఈ విషయం మీద రూరల్ సిఐని వివరణ కోరగా అధికారిని ఇచ్చిన పిర్యాదుపై విచారణ చేపట్టి నిందితునిపై కేసు నమోదు చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ ముష్కరాజు తెలిపారు….
జనం ముచ్చట న్యూస్,హైదరాబాద్ :9703973456
