మహా శివరాత్రి రోజున గుంటు మల్లేశ్వర స్వామి ఆలయంలో “తుమ్మల యుగంధర్” ప్రత్యేక పూజలు!!

Pathi Sreenivas Rao
2 Min Read
గుంటు మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న తుమ్మల యుగంధర్....

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం నగరంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన గుంటు మల్లేశ్వర స్వామి ఆలయం తెల్లవారుజామునుండే భక్తులు బారులు తీరారు,దేవాలయానికి ఇరువైపులా వేలాదిమంది భక్తులు శివయ్య దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉండటం విశేషం,….

మహా శివరాత్రి రోజున రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు డాక్టర్ తుమ్మల యుగంధర్ గుంటు మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి,స్వామి వారికి పూల మాలలు సమర్పించి మహా శివునికి అభిషేకం చేశారు,ఈ సందర్భంగా పూజార్లు ఆశీర్వచనాలు అందించి,తీర్థ ప్రసాదాలు అందజేశారు,అంతకు ముందు ఆలయ అర్చకులు,ఆలయ కమిటీ సభ్యులు, డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యుగంధర్ కి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు….

ఈ సందర్భంగా తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ.. మహాశివరాత్రి పర్వదినాన రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, సుఖ శాంతులతో విరాజిల్లాలని అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆ పరమశివుడిని వేడుకున్నాననీ తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు……

ఈ ఆలయానికి వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుందని తెలిసి కూడా సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడంలో దేవాదాయ శాఖ,ఆలయ పాలక మండలి విఫలమయ్యారు, ఆలయ కమిటీ సభ్యులు విఐపిల ప్రాపకం కోసం తహ తహ లాడటం తప్ప సామాన్య భక్తుల గోడు పట్టించుకున్న నాధుడులేడనే ఆరోపణలు వినిపించాయి,భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడలేక నరకయాతన అనుభవించారు,భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ కమిటీ సరైన ఏర్పాట్లు చేయనప్పటికీ ఖమ్మం త్రీ టౌన్ పోలీసులు మాత్రం అష్ట కష్టాలు పడి భక్తులను కట్టడి చేస్తూ క్యూ లైన్లలో ఏటువంటి అసౌకర్యం కలగకుండా చూడడంలో సక్సెస్ అయ్యారు…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment