మున్సిపల్ చైర్మన్ల ఎన్నికకు ఇంచార్జీలను నియమించిన TPCC అధ్యక్షుడు!!

Pathi Sreenivas Rao
1 Min Read

ఖమ్మం జిల్లా లోని ఐదు మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నిమిత్తం టి.పి.సి.సి అద్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఇంచార్జులను నియమించారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు….

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా విజయకేతనం ఎగురవేసిన సందర్భంగా ఏదులాపురం మున్సిపాలిటీ విప్ గా జిల్లా కాంగ్రెస్ నాయకులు తుంబూరు దయాకర్ రెడ్డి, మధిర మున్సిపాలిటీ విప్ గా కోనా ధనికుమార్, వైరా మున్సిపాలిటీ విప్ గా వైరా శాసనసభ సభ్యులు మాలోత్ రాందాస్ నాయక్, కల్లూరు మున్సిపాలిటీ విప్ గా జిల్లా కాంగ్రెస్ నాయకులు పొంగులేటి ప్రసాదరెడ్డి ,సత్తుపల్లి మున్సిపాలిటీ విప్ గా సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ సభ్యులు మట్టా రాగమయిలను
నియమించారు….

వీరంతా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు విప్ జారీ చేసిన మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ లను ఎన్నుకోవడంలో సహకారం అందించవలసిందిగా మహేశ్ కుమార్ గౌడ్ కోరారు ,అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించిన నాయకులకు,కార్యకర్తలకు,ఓటరు మహాశయులకు ధన్యవాదాలు,మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు….

📄 Generate e-Paper Clip
Share This Article