మున్సిపల్ ఎన్నికల్లో “పొంగులేటి మార్క్” రాజకీయం!!

Pathi Sreenivas Rao
2 Min Read

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కురుక్షేత్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించాడు,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పగించిన బాధ్యతలను సవాలుగా తీసుకునీ తన వ్యూహ చతురతకు అంగబలం,అర్ధ బలం తోడవడంతో మున్సిపల్ ఎన్నికల్లో BRS పార్టీ పెట్టుకున్న బారి ఆశలకు గండి కొట్టాడు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలను తలకిందులు చేశారు,కేవలం అంకెలే కాదు…ఆ అంకెల వెనుక ఉన్న ఆయన కష్టం, గడగడపకు తిరుగుతూ ఆయన చేసిన ప్రచారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది,తనకు మాత్రమే సాధ్యమయ్యే ఎత్తుగడలతో ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేసి అసాధ్యమనుకున్న సమీకరణాలను సుసాధ్యం చేయడంలో “పొంగులేటి మార్క్” రాజాకీయాన్ని రాష్ట్ర ప్రజలకు చూపించారు,కేవలం 10 రోజుల్లోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో ఆయన అడుగుపెట్టిన ప్రతిచోటా కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించడంలో సక్సెస్ అయ్యారు,
“ఖమ్మం గడ్డ పొంగులేటి అడ్డా” అని మరోసారి నిరూపించుకున్నారు……

కచ్చితమైన ప్రణాళిక, ఖమ్మం జిల్లా రాజకీయాలపై పూర్తి స్థాయిలో పట్టు కలిగి సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డి, క్యాంపు కార్యాలయం ఇంచార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి,సహాయ సహకారాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ విపక్షాల విమర్శలకు ఎక్కడికక్కడ
“చెక్”పెట్టుకుంటూ,ప్రత్యర్థుల నోళ్లకు తాళాలు పడేలా చేసి
మంత్రి పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల్లో 32 వార్డుల్లో ఏకంగా 24 చోట్ల జయకేతనం ఎగురవేసి సత్తా చాటారు,తన సొంత అడ్డాలో తిరుగులేని హవా కొనసాగించారు,ఇదేదో గాలివాటం కానే కాదు..ముమ్మాటికి ముంచుకొస్తున్న సునామీ అని నీరుపంచారు…

అంతే కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్ : సింగరేణి హృదయంలో 22 స్థానాలను కైవసం చేసుకున్నారు,కల్లూరు & సత్తుపల్లి: కల్లూరులో 12, సత్తుపల్లిలో 17 వార్డులను హస్తం ఖాతాలో వేశారు,ఇల్లందు&అశ్వారావుపేట : ఇక్కడ కూడా ఇల్లందులో 19, అశ్వారావుపేటలో 17 స్థానాల్లో గెలిచి తన పట్టును నిరూపించుకున్నారు అంతే కాకుండా ఓరుగల్లు కోటపై హస్తం జైత్రయాత్ర సాగించారు,భూపాలపల్లి, పరకాల స్టేషన్ ఘనపూర్ వంటి కీలకమైన మున్సిపాలిటీలలో విజయాన్ని సాధించి కాంగ్రెస్ పార్టీ ప్రాభవాన్ని చాటారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా బాధ్యతలను స్వీకరించిన మంత్రి పొంగులేటి తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి ప్రత్యర్థుల కోటలను బద్ధలు కొట్టారు……

అంతే కాకుండా మంత్రి పొంగులేటి ప్రచారం నిర్వహించిన 249 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 174 స్థానాలను గెలుచుకునీ,70 శాతం స్ట్రైక్ రేటుతో ‘మోస్ట్ సక్సెస్‌ఫుల్’ లీడర్‌గా అవతరించారు, పగలనక రేయన ఆయన సాగించిన సుడిగాలి పర్యటనలు, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలకు కల్పించిన భరోసా ఓట్ల వర్షంగా కురిసింది,మాట ఇస్తే తప్పని నైజంతో, రాష్ట్ర అభివృద్ధిపై ఉన్న నిబద్ధతతో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రజాప్రభుత్వంలో తన మార్క్ రాజకీయాలను మరోసారి చాటిచెప్పారనడంలో ఏలాంటి అతిశయోక్తి లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment