జనం ముచ్చట: ఏదులాపురం మున్సిపాలిటీ!!
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో ఏదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మ్రోగించింది,
మొత్తం 32 వార్డులకు గానూ కాంగ్రెస్ పార్టీ 24 స్థానాల్లో గెలుపొంది వార్ వన్సైడ్ చేయడంతో మంత్రి పొంగులేటి మున్సిపాలిటీపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించారు,ప్రత్యర్థి పార్టీలైన BRS,CPI,CPM పార్టీలు తమకు పట్టు ఉన్న వార్డుల్లో కూడా ఎక్కడా తమ ప్రభావాన్ని చూపలేక పోయాయి,సిపిఐ పార్టీ 3, సిపిఎం పార్టీ 2,బి.ఆర్.యస్.పార్టీ రెండు స్థానాలకు పరిమితం చేసి ఏటువంటి బేరసారాలకు తావు లేకుండా పూర్తి మెజారిటీ సాధించారు…..

పోకబత్తిన అనిత 23వ వార్డు కౌన్సిలర్….
అసలు విషయానికొస్తే ఏదులాపురం మున్సిపాలిటీ ఎస్సీ మహిళకు రిజర్వు అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే, కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన 24 స్థానాల్లో నలుగురు ఎస్సీ మహిళలు విజయం సాధించడంతో చైర్మన్ అభ్యర్థి ఎన్నిక కీలకంగా మారింది, నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీకి మొదటి చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందోననే అంశంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది, ముఖ్యంగా 23 వ వార్డులో గెలిచిన పోకబత్తిన అనిత,17 వ వార్డులో గెలుపొందిన గొడ్డుగొర్ల కృష్ణకుమారి పేర్లు ప్రధానంగా వినిపిస్తుండగా 9 వ వార్డు నుండి కందుకూరి శేషమ్మ,21వ వార్డు నుండి విజయం సాధించిన కోటమర్తి సునీత పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలియవచ్చింది…..

గొడ్డుగొర్ల కృష్ణకుమారి 17 వార్డు కౌన్సిలర్…..
అదే విధంగా చైర్మన్ అభ్యర్థులకు కలిసి వచ్చే అంశాలను పరిగణనలోకి తీసుకుంటే పోకబత్తిన అనిత విషయానికి వస్తే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుండి చైర్మన్ అభ్యర్థిగా బలమైన ప్రచారం జరగడం,స్థానికురాలు కాకపోయినప్పటికీ BRS పార్టీకి బలమైన స్థానంలో గెలుపొందడం కలిసొచ్చే అంశాలు కాగా,మరో అభ్యర్థి గొడ్డుగొర్ల కృష్ణకుమారి విషయానికొస్తే BRS పార్టీ,వామపక్ష పార్టీలు కంచుకోటగా భావించే మద్దులపల్లి గ్రామం నుండి ప్రత్యర్థులను మత్తికరిపించి అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం,ఉన్నత విద్యావంతురాలుగా మొదటి నుండి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడం, ఎన్నో ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని గ్రామ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన కుటుంబం కావడం కలిసొచ్చే అంశాలుగా కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తుంది….

కందుకూరి శేషమ్మ 9వ వార్డు కౌన్సిలర్….
ఇక కందుకూరి శేషమ్మ విషయానికి వస్తె పెద్దగా చదువుకోనప్పటికీ,శేషమ్మ భర్త కందుకూరి వెంకటనారాయణ అధికారం ఉన్నా,లేకపోయినా
మొదటి నుండి ఖమ్మం రూరల్ మండల కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడుగా కొనసాగుతుండడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం కలిసి వచ్చే అంశాలుకాగా,కోటమర్తి సునీత విషయానికొస్తే మొదటి నుండి కాంగ్రెస్ కుటుంబం కావడం,ఉన్నత విద్యావంతురాలు కావడం కూడా కలిసొచ్చే అంశాలుగా కార్యకర్తలు భావిస్తున్నారు…..

కోటమర్తి సునీత 21వ వార్డు కౌన్సిలర్…..
పత్తి శ్రీనివాస్, హైదరాబాద్:9703973456
