ఖమ్మం సిటీ:Feb:4:2:2026
ఏదులాపురం : మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో కాంగ్రెస్ పార్టీ అగ్రశ్రేణి శ్రేణులు సుడిగాలి పర్యటనలతో దూసుకుపోతున్నాయి. మంగళవారం సాయంత్రం 18, 19 వార్డుల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమం రాజకీయ వేడిని రాజేసింది, ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది,18వ వార్డు అభ్యర్థిని పందూరి అరుణ, 19వ వార్డు అభ్యర్థిని మాలాది శిరీష గెలుపును ఆకాంక్షిస్తూ బారుగూడెం, గొల్లగూడెం ప్రాంతాల్లో ప్రసాద్‌రెడ్డి విస్తృతంగా పర్యటించారు,గడప గడపకూ వెళ్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు…..

ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఈఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న పొంగులేటి ప్రసాద్ రెడ్డి….
ఈ సందర్భంగా పొంగులేటి ప్రసాదరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన రెండేళ్లలోనే పేదలకు అండగా నిలిచే అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, అదే స్ఫూర్తితో మున్సిపాలిటీని తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు,అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే పట్టణ ప్రగతి మరింత వేగవంతం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఫిబ్రవరి 11న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజారిటీతో విజయతీరాలకు చేర్చాలని పిలుపునిచ్చారు…..

ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగిస్తున్న పొంగులేటి ప్రసాద్ రెడ్డి….
పొంగులేటి ప్రసాదరెడ్డి ఇంటింటి ప్రచారంలో యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అభ్యర్థులకు ఘనస్వాగతం పలికారు.ఈ ప్రచార జోరు చూస్తుంటే ఏదులాపురంలో హస్తం జెండా ఎగరడం ఖాయమని పార్టీ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు….

Pathi Sreenivas Rao:9703973456
