ఏదులాపురం మున్సిపాలిటీలో భోని కొట్టిన కాంగ్రెస్!!

Pathi Sreenivas Rao
1 Min Read
Congress beats Bhoni in Yedulapuram Muncipality....

ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టింది తెల్దారుపల్లి గ్రామంలోని 15 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వర్గీయ తమ్మినేని కృష్ణయ్య సతీమణి తమ్మినేని మంగతాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు తన సమీప సిపిఎం పార్టీ అభ్యర్థి తమ్మినేని విజయలక్ష్మి, బీజేపీ అభ్యర్థి గజ్జి రజితలు తమ నామినేషన్లు ఉపసంహారించుకోగా తమ్మినేని మంగతాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు,ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంది…..

ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని కృష్ణయ్య సతీమణి మంగతాయి

ఈ నేపథ్యంలో తమ్మినేని కృష్ణయ్య ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకుంది,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వీట్లు పంచుకుని సందడి చేశారు,ఈ సందర్బంగా తమ్మినేని మంగతాయి మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆశీస్సులతో తెల్దారుపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని,తెల్దారుపల్లి గ్రామంలో మిగతా రెండు వార్డులను భారీ మెజారిటీతో గెలిపించి తమ్మినేని కృష్ణయ్యకు అంకితం చేస్తామని అన్నారు,తన విజయానికి అన్నీ విధాల సహాకరించిన తెల్దారుపల్లి గ్రామ ప్రజలందరికి కృతజ్ఞతలు తెలియజేసారు….

ఇది ఇలా ఉండగా తమ అభ్యర్థిని బలవంతంగా కొట్టి
నామీనేషన్ ఉపసంహారింప జేశారని బీజేపీ పార్టీ ఆందోళన నిర్వహించింది,ఈ సందర్బంగా బీజేపీ పాలేరు నియోజకవర్గ
ఇంచార్జి నున్నా రవి కుమార్ మాట్లాడుతూ తెల్దారుపల్లి గ్రామంలో ప్రజాస్వామ్యం కూని జరిగిందని,బీసీ అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తే వాళ్ళని బెదిరించి నామినేషన్ ఉపసంహరించుకునేలా చేసారని, మంత్రి పొంగులేటి అండతో అరాచకాలు సృష్టుస్తున్నారని, రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో గ్రామంలోని బీసీలు నలిగి పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు….

Pathi Srinivasa Rao:9703973456

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment