ఖమ్మం నగరంలో అరాచకం రాజ్యమేలుతుంది: పువ్వాడ అజయ్ కుమార్!!

Pathi Sreenivas Rao
2 Min Read

ఖమ్మం నగరంలో 17,34 డివిజన్ల నందు జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పాల్గొన్నారు,కార్యక్రమంలో అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ పార్టీకి అండగా ఉండాల్సిన సమయంలో మోసం చేసి వెళ్ళిపోయిన వారికి ప్రజలే బుద్ది చెపుతారని,BRS పార్టీకి ద్రోహం చేసి హస్తం గూటికి చేరిన వారికి హస్తమే వారి నెత్తిన బస్మాసురా హస్తం అవుతుందనీ,రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో డిపాజిట్లు రాకుండా ప్రజలే చిత్తు చిత్తుగా ఓడిస్తారని అన్నారు….

అదే విధంగా బిఆర్ఎస్ విడిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన వారిని అడుగుతున్నా మీరు అధికార పార్టీలోకి పోయారు కదా మీకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు పేదలకు ఇప్పించే సత్తా ఉందా అని ప్రశ్నించారు,నేను మంత్రిగా సమయంలో ఏంతో మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాను.ఇప్పుడు ఈ ప్రభుత్వం ద్వారా అందరికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని డిమాండ్ చేసారు,నేను మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి,సెటిల్మెంట్స్,మట్టి దందా జరిగిందని
తప్పుడు ప్రచారం చేసి అభూత కల్పనలు సృష్టించి ఎన్నికల్లో గెలిచారు ఈ రోజు రఘునాథపాలెం మండలంలో విచ్చలవిడిగా సాగుతున్న మట్టి దందా వెనుక ఎవరున్నారో ప్రజలు చూస్తూనే ఉన్నారు,బజారుకి ఒక రౌడీ మూకను తయారు చేసి భూ సెటిల్మెంట్స్ చేస్తున్నదెవరో అందరికీ తెలుసునని అన్నారు,అత్త తెడ్డు నాకి కోడలికి బుద్ధి చెప్పినట్లు ఆరోజు అవినీతి,అక్రమ కేసులు పెడుతున్నారంటూ జనం ముందు గగ్గోలు పెట్టిన పెద్ద మనుషులు ఈరోజు చేస్తున్నదేమిటి, ఖమ్మం నగరంలో జరుగుతున్న అరాచకాల మీద నోరేందుకు మెదపడంలేదని నిలదీశారు….

బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఖమ్మంలో నేను చేసిన అభివృద్దే తప్ప వేరే కొత్తగా చేసింది ఏమి లేదని ఏద్దేవా చేశారు,ఇప్పుడు ప్రభుత్వంలో మంత్రులు సింగరేణి మరియు ఇతర కాంట్రాక్టుల విషయాలలో వారే పంచాయతీలు పెట్టుకొని విమర్శలు చేసుకుంటున్నారు,వారు ప్రజలకు ఏమి చేస్తారని ప్రశ్నించారు,నా మీద అవాకులు చవాకులు మాట్లాడిన వారికి ప్రజలే బుద్ది చెపుతారని అన్నారు…..

ఈ కార్యక్రమంలో BRS పార్టీ జిల్లా నాయకులు కూరాకుల నాగభూషణం, అర్జేసి కృష్ణ, బచ్చు విజయ్ కుమార్, నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు,కర్నాటి కృష్ణ,బత్తుల మురళి,ఖమర్,మక్బూల్,మాటేటి నాగేశ్వరరావు,దండా జ్యోతి రెడ్డి తదితర ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు….

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment