ముదిరిన రీల్స్ పిచ్చి,పంతులమ్మ ఉద్యోగం ఊస్టింగ్!!

Pathi Sreenivas Rao
2 Min Read

సోషల్ మీడియా యుగంలో మంచికన్నా చెడును ఎక్కువగా ప్రభావితం ఎక్కువ చేస్తుంది,విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లు రీల్స్ పిచ్చిలో పడి ఉద్యోగాలకు ఎసరు పెట్టుకుంటున్నారు,తాజాగా ఖమ్మం నగరం, మామిల్లగూడెం ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న గౌతమి రాథోడ్ అనే ఉపాధ్యాయిని రీల్స్ పిచ్చిలో పడి ఉద్యోగం నుండి సస్పెండ్ చేయబడింది….

అందమైన రూపం,ఎదుటి వాళ్లను కట్టిపడేసే అభినయం, ఇనిస్టాగ్రామ్,ఫేస్ బుక్ ఖాతాలకు లక్షల మంది ఫాలోవర్స్,
ఇబ్బడి ముబ్బడిగా కార్పోరేట్ ప్రమోషన్లు,చేతినిండా డబ్బు,
గవర్నమెంట్ ఇచ్చే జీతంకన్నా ఎక్కువ సంపాదన వస్తుంది అనుకుందేమో పాపం…ప్రైవేటు,కార్పొరేట్ విద్యాసంస్థలకు పెయిడ్ ప్రమోషన్లు చేయ డంలో బిజీగా మారి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది, స్కూల్ సమయంలో రీల్స్ చేయొద్దంటూ అధికారులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ వారి మాటలను పెడచెవిన పెట్టింది,ఉన్నతాధికారులు ఎంత చెప్పినా తన పనితీరు మార్చుకోకపోగా నగరంలోని ఓ కార్పోరేట్ పాఠశాల అడ్మిషన్లకు సంబంధించిన పెయిడ్ ప్రమోషన్లు చేస్తూ,తన ప్రభుత్వ పాఠశాల విధులను నిర్లక్ష్యం చేసింది,దీంతో ఒళ్లు మండిన పై అధికారులు పాఠశాల సమయంలో రీల్స్ చేస్తూ సమయం వృథా చేస్తోందనే అంశాలను పరిగణనలోకి తీసుకుని,పలు మార్లు హెచ్చరించినా తన తీరు మార్చుకోకపోవడంతో గురువారం ఆమెను విధులనుండి సస్పెండ్ చేసినట్లు డీఈవో తెలిపారు….

అదే విధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు కేవలం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని, విధినిర్వ హణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు,ఈమెతో పాటు డీఈవో కార్యాలయంలో
మరో ఇద్దరు సిబ్బందికి మెమోలు జారీ చేశారు,ఒకరు సమయ పాలన పాటించకుండా మధ్యాహ్నమే ఇంటికి వెళ్లడం,మరొకరు ఫైల్స్ ఆలస్యం చేస్తూ డీఈవో టేబుల్ పై ఉన్నాయంటూ అబద్ధాలు చెబుతుండటంతో మెమో జారీ చేసినట్లు డీఈవో పేర్కొన్నారు,కార్యాలయ సిబ్బంది కార్యాలయ సమయపాలన పాటించాలని లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సిబ్బందినీ హెచ్చరించారు…..

పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ సోషల్ మీడియాలో సభ్య సమాజం తలదించుకునేలా అసభ్యకరమైన రీల్స్ చేస్తూ వీళ్లు చదువు చెప్పే విద్యార్థులకు,సమాజానికి ఎలాంటి మెసేజ్ పంపిస్తున్నారని,
గవర్నమెంట్ ఉపాధ్యాయినిగా ప్రైవేట్ పాఠశాలల అడ్మిషన్ల కోసం పెయిడ్ ప్రమోషన్లు చేయడం ఏమిటని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు,ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు…..

📄 Generate e-Paper Clip
Share This Article