కాంగ్రెస్ పార్టీలో వైయస్సార్ అభిమాన మంత్రులే ABN రాధాకృష్ణ టార్గెట్!!

Pathi Sreenivas Rao
7 Min Read
The real truth behind ABN Radhakrishna's viciousness towards Dalit minister Mallu Bhatti Vikramarka...

మల్లు భట్టి విక్రమార్క నిబద్దతకు నిలువుటద్దం,ఉన్నత విద్యావంతుడు, నలబై ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పట్టిన జెండాను వదలకుండా అనేక ఆటుపోట్లను ఎదుర్కుంటూ ముఖ్యంగా,ఖమ్మం జిల్లాలో ఎన్నో ఏళ్లుగా వెళ్ళూనుకుని ఉన్న “కుల రాజకీయాలను”
అధిగమించి ఒకసారి ఎమ్మెల్సీగా, 2009 నుండి 2023 వరకు వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, కాంగ్రెస్ పార్టీలో ఒక స్థాయిగల లీడర్ గా ఎదిగి,నేడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న దళిత మంత్రి,…అలాంటి మల్లు భట్టి విక్రమార్క మీద ABN రాధాకృష్ణ, తెలుగుదేశం మీడియా హటాత్తుగా తుపాకులు ఎందుకు ఎక్కు పెట్టాల్సి వచ్చింది,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ది తెలుగుదేశం పార్టీతో కలిసి మెలిసి సాగుతూనే ఉన్నాడు,తెలుగుదేశం మీడియాతో మంచి సంబంధాలే నడుపుతున్నాడు,ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూనే ఉన్నారు,కానీ మల్లు భట్టి విక్రమార్క విషయంలో తెలుగుదేశం మీడియా అనుసరిస్తున్న తీరు ఎక్కడో తేడా కొడుతోంది, కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి,ముఖ్యంగా ఈఈరోజు ఖమ్మంలో రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్ది ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో సియం. రేవంత్ రెడ్ది చేసిన కొన్ని వ్యాఖ్యలు నిషితంగా గమనిస్తే తెలంగాణాలో తెలుగుదేశం పార్టీని బ్రతికించడం కోసం సియం.రేవంత్ రెడ్డి ఎంత తహ తహ లాడుతున్నారనేది సామాన్యులకు సైతం అర్ధం అవుతుంది…,

ఖమ్మం సభలో మాట్లాడిన సియం.రేవంత్ యన్టీఆర్, చంద్రబాబు అభిమానులకు,సహచరులకు ఒక పిలుపునిచ్చారు, తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ ఉనికి ఉండకూడదని కక్షగట్టి,తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని నిర్వీర్యం చేసి, తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చేసిన కేసీఆర్ పైన పగ తీర్చుకోవాలి,బి.ఆర్.యస్ పార్టీని,కేసీఆర్ ను వంద మీటర్ల లోతులో సమూలంగా పాతి పెట్టాలి,బి.ఆర్.యస్ పార్టీవాళ్ళు గద్దెలు దిగాలి,గ్రామాల్లో బి.ఆర్.యస్ పార్టీ దిమ్మలు కూలాలీ అపుడే స్వర్గీయ నందమూరి తారక రామారావుకు నిజమైన నివాళి అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు కానీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండ కూడదు, కాంగ్రెస్ పార్టీని ఈ దేశం నుండి తరిమి కొట్టాలి అనే నినాంధంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో కనుమరుగై పోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్ది ఎందుకు అంత ఆవేదన చెందుతున్నాడో అర్ధంకాని పరిస్థితి….

పైగా తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ నాయకత్వన్ని నిర్వీర్యం చేసాడు అంటున్నారు అంటే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్ది కూడా నిర్వీర్యం అయ్యాడన్నది ముమ్మాటికి నిజం, అందుకే అప్పటిలాగే తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ గా ఉండి ఉంటే ఇపుడు తెలుగుదేశం పార్టీ తరుపున ముఖ్యమంత్రి అయ్యి ఉండి వాడినేనని రేవంత్ రెడ్ది భావిస్తున్నారేమో…ఈ విషయం అలా ఉంటే తెలంగాణాలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ బ్రతికి బట్ట కట్టాలనీ ఒకవైపు తహతహ లాడుతూ తెలుగుదేశం పార్టీపై యెనలేని ప్రేమాభిమానాలు చూపిస్తుంటే మరోవైపు ఇదే రోజు యన్టీఆర్ వర్ధంతి సందర్బంగా జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం రేవంత్ వ్యాఖ్యలకు భిన్నంగా స్పందించారు, ఎన్టీఆర్ కాంగ్రెస్ వ్యతిరేక నినాదంతో రాజకీయాల్లోకి వచ్చాడని,దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఎక్కత్రాటిపైకి తెచ్చారని,ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వడం అనేది సముచితమని,భారత రత్న సాధించి తీరుతమంటూ చంద్రబాబు మరోసారి శపదం చేసాడు,ఈ ఇద్దరి పరస్పర వైరుధ్య ప్రకటనల నేపథ్యాన్ని గమనిస్తే ఎన్డీయే భాగస్వామిగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక స్టేట్మెంట్ ఇస్తే తెలంగాణాలో మాత్రం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ లేకపోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు, ఇదెక్కడి విచిత్రమైన రాజకీయమో అర్ధం కాని పరిస్థితి నెలకుంది…..

నిన్న హటాత్తుగా ఏబియన్ రాధా కృష్ణ తన వీకెండ్ కామెంట్ “కొత్త పలుకు”లో తెలంగాణా డిప్యుటీ సియం మల్లు భట్టి విక్రమార్కను ఒక రేంజ్ లో ఎందుకు టార్గెట్ చేసాడు, ఎబియన్.రాధా కృష్ణ తన ఆర్టికల్ లో చెప్పిన విషయాలు నమ్మశఖ్యమేనా అనే విషయానికొస్తే, కోమటిరెడ్డి వెంకట రెడ్డి సోదరుల్లో ఒకరు బొగ్గు గనుల టెండర్ కోసం పోటీ పడుతున్నారు, వారిని ఆ టెండర్ నుండి తప్పించడం కోసం NTV చైర్మన్ నరేంద్ర చౌదరి, మల్లు భట్టి విక్రమార్క కలిసి కుట్ర చేసి కోమటిరెడ్డి వెంకట రెడ్ది మీద రాసలీలల కధనాన్ని ప్రచారం చేశారని ABN రాధకృష్ణ చెబుతున్నారు,అంటే ఒక సీనియర్ మంత్రి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి లాంటి ఒక బలమైన నాయకుడు మీద రాసలీలలు అని ఒక స్టోరీ ప్రచారం చేయగానే వందల కోట్ల రూపాయల విలువ చేసే కాంట్రాక్ట్ నుండి తప్పుకుంటారా,పైగా NTV ప్రచారం చేసిన కథనంలో మంత్రి పేరు ఎక్కడా నేరుగా ప్రస్థావించలేదు, ప్రస్తుతం బొగ్గుగని టెండర్ కోసం పోటీ పడుతున్నది నేరుగా మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి కుడా కాదు, అయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని రాధాకృష్ణ అంటున్నాడు,
అలాంటప్పుడు రాస లీలలు కధనం ప్రచారం చేయగానే కాంట్రాక్టు వదిలేసి పోతారంటే నమ్మడానికి సాధ్యమవుతుందా…..

ముఖ్యంగా ఆడియో, వీడియో టేపులు ఆధారాలుగా ఉన్నప్పటికీ,డీప్ ఫేక్,ఏఐ జనరేటెడ్ అని తప్పించుకునే ఈ రోజుల్లో టీవీల్లో ఒక కధనం ప్రచారం కాగానే వందల కోట్ల కాంట్రాక్ట్ టెండర్ నుండి ఏ మంత్రి సోదరుడైనా తప్పుకునే అవకాశం ఉంటుందా, ఒకవేళ మంత్రి కోమటిరెడ్డి రాస లీలలకు సంబందించి ఆధారమేదైనా ఉంటే, పలనా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, మీ సోదరుడు బొగ్గుగని కాంట్రాక్ట్ టెండర్లలో పాల్గొంటే మేము కధనాన్ని ప్రచారం చేస్తామని బెదిరించే వాళ్ళుగా,అలా బెదిరించిన దాఖలాలు కూడా ఏమి లేవు,ఒకవేళ బెదిరించి ఉండి ఉంటే కోమటిరెడ్డి సోదరులు బయటకు చెప్పేవారుగా, డైరెక్టుగా కధనం ప్రచారం చేసాక కోమటిరెడ్డి సోదరులు ఇంకా ఎందుకు బయపడతారు,తన సోదరుణ్ణి టెండర్ల విషయంలో ఇంకా ఎక్కువగా ప్రోత్సహించే వారు, కాబట్టి రాధకృష్ణ చెప్పే లాజిక్ ఎక్కడా సింక్ అయ్యే పరిస్థితి కనబడటం లేదు….

ఈ విషయాలన్నీ పక్కన బేడితే అసలు డిప్యూటీ సియం మల్లు భట్టి విక్రమార్కను రాధాకృష్ణ టార్గెట్ చేయడం వెనుక అసలు కారణం ఏమిటంటే… తెలంగాణా ప్రభుత్వంలో సియం.రేవంత్ రెడ్డి పూర్తిగా తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం మీడియకి చాలా సానుకూలంగా ఉంటున్నారు, ఎన్ని విమర్శలు వచ్చినా లెక్క చేయకుండా రాధాకృష్ణ ఇంటికి వెళ్లి మరీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు, అలాంటి నేపథ్యం ఒకవైపు ఉంటే అదే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో వై.యస్ రాజశేఖర్ రెడ్డికి సంబందించిన అనుచరులున్నారు,ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి ని ఇష్ట పడేవాళ్ళు ఉన్నారు, అది తెలుగుదేశం మీడియాకు ఇష్టం లేదు, ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్లు, వైస్సార్ అభిమానులు అత్యంత శక్తివంతమైన మంత్రులుగా ఉండడం తెలుగుదేశం మీడియా జీర్ణించుకోలేక పోతుంది, ఒక విధంగా చెప్పాలంటే రేప్పోద్దున వాళ్లందరి మీద కూడా ఇలాంటి నిందలు వేసి పక్కకు తోసేయాలనే ఒక ప్రణాళికను రాధకృష్ణ ఇపుడే మొదలు పెట్టినట్లు ఉన్నాడు,…..

అందుకే ఒక దళిత నాయకుడు,విద్యావంతుడు,సుధీర్ఘ రాజకీయ పోరాటంలో ఎన్నో అటుపోట్లను ఆదిగమించి, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అనాదిగా వేళ్లునుకుని కున్న వున్న “కుల రాజకీయాలను” ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీలో “నెంబర్ టూ” స్థానానికి ఎదిగిన నాయకుణ్ణి పక్కకు తప్పించి,వీక్ చేయడానికి తెలుగుదేశం మీడియా తుపాకులు ఎక్కు పెట్టినట్లు కనబడుతుంది, అయితే డిప్యూటీ సియం.మల్లు భట్టి విక్రమార్క తన మీద ABN రాధాకృష్ణ చేసిన ఆరోపణల నేపథ్యంలో పెట్టిన ప్రెస్మీట్లో భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి,తెలంగాణా మీదకు కొన్ని గద్దలు,రాబందులు,వ్యవస్తికృత నేరగాళ్ళ సమూహం తెలంగాణ మీదకు దండెత్తి వస్తుంది,వాళ్ళ బారినుండి తెలంగాణా రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది,తెలంగాణాకు సంబందించిన వనరులు,సంపద మీద కూడా ఆ గద్దలను వాళ్లనివ్వకుండా నేను అడ్డుకుంటానని ప్రకటించారు,ఎవరి బాగు కోసం,ఎవరి మెప్పు కోసం ఇలాంటీ వార్తలు వ్రాస్తున్నారో రాధాకృష్ణ నేను తేల్చుకుంటాం,ఈ దుర్మార్గపు వ్రాతల వెనుకు ఎవరు ఉన్నారనే విషయం త్వరలో విలేకరుల సమావేశం పెట్టీ చెబుతాననని తెలిపారు,తెలంగాణా సంపద,వనరులని దోచుకోవడానికి రాబందులు,గద్దలు వస్తున్నాయని పరోక్షంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కచెబుతున్నారంటే ఇంతకు అసలు ఆ వ్యవస్తికృత నేరగాళ్లు ఎవరు,ఆ గద్దలు,రాబంధులు ఎవరు,ఎవరి అండదండలతో తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్నాయి,ఏబీఎన్ రాధాకృష్ణ దళిత మంత్రి మల్లు భట్టి విక్రమార్కపై ఎందుకు ఇంత విషం కక్కుతున్నాడు,ఆ రాబందుల కోటరీలో రాధాకృష్ణ భాగస్వామ్యం ఏమైనా ఉందా అనే విషయం త్వరలోనే బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు…..

uh

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment