ఖమ్మం జిల్లా:Jan:18:1:2026
పాలేరు నియోజకవర్గం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,జిల్లా ఇంచార్జీ మంత్రి వాకిటి శ్రీహరి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,ఎమ్మెల్యేలుపాల్గొన్నారు….

సభలో ప్రసంగిస్తున్న సీఎం. రేవంత్ రెడ్డి…
ఈ సందర్భంగా జరిగిన సభలో తెలుగుదేశం జెండాలతో టీడీపీ కార్యకర్తలు హల్ చల్ చేశారు, కాంగ్రెస్ సభలో తెలుగుదేశం పార్టీ జెండాలను చూసిన ఆనందమో,ఉత్సాహమో తెలియదుగానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఎన్టీఆర్,చంద్రబాబులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు,ఈ సందర్భంగా సీఎం.రేవంత్ మాట్లాడుతూ ఈరోజు విషాదకరమైన రోజు అంటూనే,దివంగత ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు,ఒకనాడు తెలుగువారిని మద్రాసీలని పిలువబడే క్రమంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావని,పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి,పేదవాడి కడుపు నింపాలి,పేదవాడి కండల్లో ఆనందం చూడాలని అనాడు రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావని,ఆరోజు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ రాజ్యంలో ఈ పథకాన్ని వినూత్నంగా చేపట్టాలని,పేదలకు దొడ్డు బియ్యం కాకుండా రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి ఆరు కిలోలు సన్న బియ్యం ఉచితంగా బియ్యం పంపిణీ పథకాన్ని కొనసాగిస్తున్నామని,ఇదే స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు….
తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావుకు,నారా చంద్రబాబు నాయుడుకు అభిమానులు, సహచరులు ఉన్నారు,వాళ్లందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నానని, తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండొద్దని కక్షగట్టి,ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన కేసీఆర్ ను వంద మీటర్ల గొయ్యిలో సమూలంగా పాతిపెట్టాలి,గ్రామాల్లో బి.ఆర్.యస్ పార్టీవాళ్ళు గద్దెలు దిగాలి,గ్రామాల్లో బి.ఆర్.యస్ పార్టీ దిమ్మలు కూలాలీ అపుడే నందమూరి తారక రామారావుకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని,ఆ విధంగా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని,బి.ఆర్.పార్టీని బొంద పెట్టాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు,దీంతో సభలో తెలుగుదేశం కార్యకర్తలు జై తెలుగుదేశం,జై రేవంత్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు,రాష్ట్రాలు వేరైనా ఎన్టీఆర్, చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలను ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నామని అన్నారు,సీఎం.రేవంత్ రెడ్డి ఆద్యంతం ఎన్టీఆర్, చంద్రబాబులను, తెలుగుదేశం పార్టీనీ కీర్తించడంతో ఒకానొక సమయంలో ఇది కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సభనా లేక తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన సభనా అనే విషయం అర్ధం కాక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కాసేపు అయోమయం నెలకొంది….
అదే విధంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై తీవ్ర పదజాలంతో సీఎం. రేవంత్ విరుచుకు పడ్డారు,ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఇపుడే చేసుకున్నది,అయిదు సంవత్సరాల కోసం ఎన్నికైన ఈ ప్రజా ప్రభుత్వాన్ని మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఒక్క పక్కన శుక్రాచార్యులు, మరోపక్క మారీచుడు,సుపాలుడు బయలుదేరారని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు,ఆనాడు పురాణాలలో దేవతల యజ్ఞాలు, యాగాలు చేస్తుంటే భగ్నంచేసినట్లుగానే ఈ నాడు సామాన్యులకు మేలు జరగొద్దని రాక్షసుల కుల గురువు శుక్రాచార్యుడైన కేసిఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో కూర్చొని మారీచుడు,సుపాలుడైన కేటీఆర్,హరీష్ రావులను దగ్గర పెట్టుకుని శకుని పన్నగాలు పన్నుతుండు,దుర్యోధన వంశాన్ని దగ్గర పెట్టుకుని ఏదోరకంగా పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తున్నాడు,శుక్రాచార్యుడు కేసిఆర్ ఫామ్ హౌజ్ లో పండితే మారీచుడు సుపాలుడు బావా బామ్మర్దులు కేటీఆర్,హరీష్ రావులు అసెంబ్లీలో కూర్చునీ ఈ ప్రభుత్వం మీద బట్టగాల్చి మీదెయ్యాలనే ప్రయత్నం చేస్తున్నారు,ఆనాడు సీతా దేవిని రావణుడు ఎత్తుకు పోవడానికి సహకరించిన మారీచుడు రాముని చేతిలో సచ్చినట్లు ఈనాడు ప్రజా ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తున్న శుక్రాచార్యుడు,మారీచుడు,సుపాలుడుగా మారిన కేసీఆర్, కేటీఆర్,హరీశ్ రావులు ప్రజల చేతుల్లో రాజకీయంగా చావక తప్పదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు…..
సీఎం రేవంత్,ఎన్టీఆర్, చంద్రబాబు,తెలుగుదేశం పార్టీలను ఆద్యంతం కీర్తించడాన్ని బట్టి చూస్తే రాబోయే GHMC ఎన్నికలతో పాటు రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్,తెలుగుదేశం పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని,ఆ దిశగానే సీఎం రేవంత్ మాటలు ఉన్నాయని,ఏది ఏమైనా కాంగ్రెస్,తెలుగుదేశం పార్టీ పొత్తులకు లైన్ క్లియర్ అయినట్లేనని కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారు,ఒక వేళ అదే జరిగితే ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆలోచన ఏమిటి ? డైరెక్టుగా పొత్తు పెట్టుకుంటుందా ? లోపాయికారీగా వ్యవహరిస్తుందా అనేది తెలియాల్సి ఉంది,ఇది ఇలా ఉంటే గత సార్వత్రిక ఎన్నికలనుండి కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్న సిపిఐ పార్టీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ఒప్పుకుంటుందా అనే విషయం భవిష్యత్ నిర్ణయిస్తుందని సిపిఐ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు…..
Pathi Srinivasa Rao:9703973456
