ముఖ్యమంత్రి పర్యటనకు ప్రతిష్ట బందోబస్తు: పోలీస్ కమిషనర్ సునీల్ దత్!!

Pathi Sreenivas Rao
1 Min Read
Elaborate security arrangements for the Chief Minister's visit: Police Commissioner Sunil Duth...

ముఖ్యమంత్రి కాన్వాయ్ మార్గం, విఐపి పార్కింగ్ స్థలాలు, బారికేడ్లు మరియు ఇతర భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులందరికీ పలు సూచనలు చేశారు. అనంతరం, ఖమ్మం టౌన్ మరియు రూరల్ డివిజన్ పరిధిలో ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో చేయవలసిన ఏర్పాట్లపై సప్తపది ఫంక్షన్ హాల్‌లో సమీక్షా సమావేశం నిర్వహించి, పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమం ప్రారంభం నుండి ముగిసే వరకు ప్రతి అధికారి, సిబ్బంది అప్రమత్తంగా ఉండి, తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ఆయన సూచించారు….

మద్దులపల్లి హెలిప్యాడ్, ముఖ్యమంత్రి కాన్వాయ్ మార్గం, సభా వేదిక ప్రాంతాల పరిసరాలలో, అలాగే రూట్ బందోబస్తు విధులు నిర్వర్తించే సిబ్బంది కాన్వాయ్ రాక సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విధులు నిర్వర్తించే సిబ్బంది సమయపాలన మరియు క్రమశిక్షణ పాటించాలని తెలిపారు. కార్యక్రమానికి వచ్చే వాహనాలను నిర్దేశించిన ప్రదేశాలలోనే పార్క్ చేయాలని సూచించారు.అలాగే, ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమ ప్రాంతం వరకు హెలిప్యాడ్ నుండి కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ మార్గంలో ట్రాఫిక్ సమస్య లేకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment