ఖమ్మం జిల్లా:JAN:17:1:2026
ఈ రోజు ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్ లో సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (TWJF) ఆధ్వర్యంలో జరిగిన “మీట్ ద ప్రెస్” కార్యక్రమంలో పాల్గొని జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు సావధానంగా సమాధానం ఇచ్చారు,ఈ సందర్భంగా కూననేని మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) 1925 డిసెంబర్ 26న కాన్పూర్‌లో స్థాపించబడింది, దీనికి 2025లో 100 ఏళ్ల ప్రస్థానం పూర్తి అయింది,భారత దేశ రాజకీయ చరిత్రలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)కి ప్రత్యేకమైన స్థానం ఉందనీ,ముఖ్యంగా కార్మికులు, రైతులు, పేదల హక్కుల కోసం సాగించిన పోరాటాలకు ప్రతీకగా నిలిచిన సీపీఐ ఖమ్మం నగరంలో పెద్ద ఎత్తున వందవ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోందనీ తెలిపారు,అదే విధంగా ఒక శతాబ్దం కాలంగా దేశ సామాజిక,ఆర్థిక పరిణామాల్లో తనదైన ముద్ర వేసుకుంది,1925లో స్థాపితమైన సీపీఐ పార్టీ బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిందనీ అన్నారు…..

“మీట్ ద ప్రెస్” కార్యక్రమంలో మాట్లాడుతున్న కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు..…
ముఖ్యంగా స్వాతంత్ర్య పోరాటంలో కార్మిక సంఘాలు,రైతు సంఘాలను ఏకం చేస్తూ ప్రజా ఉద్యమాలకు దిశానిర్దేశం చేసింది,స్వాతంత్ర్యం అనంతరం కూడా భూసంస్కరణలు,కార్మిక హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సీపీఐ పార్టీ తన పోరాటాన్ని నిర్విరామంగా కొనసాగించిందనీ,పార్లమెంట్ నుంచి పంచాయతీ స్థాయి వరకు సీపీఐ ప్రతినిధులు ప్రజా సమస్యలను గట్టిగానే వినిపించారనీ,కార్మికులకు కనీస వేతనాలు, పని గంటల నియంత్రణ,రైతులకు మద్దతు ధరలు,భూ హక్కులు వంటి అంశాల్లో సీపీఐ చేపట్టిన ఉద్యమాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపాయనీ,కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో వామపక్ష రాజకీయాలకు బలమైన పునాది వేయడంలో సీపీఐ కీలక పాత్ర పోషించిందని ఈ సందర్భంగా కూనంనేని తెలిపారు,ఈ సందర్భంగా ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ కాలక్రమంలో రాజకీయ పరిస్థితులు మారినా, సీపీఐ తన సిద్ధాంతాల నుంచి వెనక్కి తగ్గలేదని,నూతన ఆర్థిక విధానాలు, ప్రైవేటీకరణ,కార్పొరేట్ల పెత్తనానికి వ్యతిరేకంగా సీపీఐ పోరాటం కొనసాగీస్తూనే ఉన్నామని,ప్రపంచీకరణలో భాగంగా పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా యువతలో కొంత మేరకు వామపక్ష భావాలు అంతరించి పోయిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు,రాబోయే కాలంలో యువతను రాజకీయంగా చైతన్యపరచడం,సామాజిక న్యాయం కోసం ఉద్యమాలను విస్తరించడం పార్టీ ముందున్న ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకున్నామని అన్నారు…..

“మీట్ ద ప్రెస్” కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును సన్మానిస్తున్న TWJF నాయకులు….
ముఖ్యంగా వామపక్షాల ఐక్యత గురించి మరో జర్నలిస్టు సంధించిన ప్రశ్నకు కూనంనేని ఒకింత తడబడ్డినట్లు కనిపించింది,ముంచుకొస్తున్న బీజేపీ పార్టీ మతోన్మాదం,అమెరికా సామ్రాజ్యవాదం,ప్రజా సమస్యలపై ప్రభుత్వాలపై పోరాడటం కోసం కమ్యూనిస్టుల కలయిక అనివార్యం అన్నారు,పొత్తు ధర్మం పేరుతో,సైద్ధాంతిక విభేదాలను పక్కన పెట్టీ కాంగ్రెస్ పార్టీని సభకు ఆహ్వానించి, సోదర కమ్యూనిస్టు పార్టీలను ఆహ్వానించలేదనే రూమర్లు వస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని మరో జర్నలిస్టు ప్రశ్నించగా అలాంటి పూజారులు నమ్మొద్దని అన్ని వామపక్ష పార్టీలను ఆహ్వానించామని కూనంనేని సాంబశివరావు తెలిపారు,ఏది ఏమైనా సీపీఐ పార్టీ వంద వసంతాల వేడుకలు కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా, పార్టీ భవిష్యత్తు దశ,దిశను నిర్దేశించే వేదికగామారాలని,ఎర్రజెండా నీడ కింద ఏకమైన ప్రజల కోసం సాగే పోరాటాలు మరో శతాబ్దం పాటు కొనసాగాలనే సంకల్పాన్ని ఈ వంద వసంతాల వేడుకలో ప్రతిబింబించాలని కార్యకర్తలు కోరుతున్నారు…..
Pathi Srinivasa Rao:9703973456
