రాబోయే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైయస్సార్ అభిమానుల సత్తా చూపిస్తాం!!

Pathi Sreenivas Rao
3 Min Read
We will show the strength of YSR's followers in the upcoming Khammam Municipal Corporation Elections.

ఖమ్మంలో గత డిసెంబర్ 21న జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం,అన్నదాన కార్యక్రమం,
పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించిన సంగతి విదితమే,ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణలో వైఎస్సార్సీపీ ఉనికే లేదని సవాళ్లు విసిరే వాళ్లకు కనువిప్పు కలిగించే విధంగా దాదాపు మూడు వేల బైకులతో ర్యాలీ నిర్వహించి ప్రతి సవాల్ విసిరామని,వైయస్ జగన్మోహన్ రెడ్డి అభిమాని ఒకరు వ్యాఖ్యానించారు,తెలంగాణలో మా పార్టీకి నడిపించే నాయకుడు లేడు,ఆర్థిక బలం లేదు అయినా మేము ఎక్కడా తగ్గలేదు స్వచ్ఛందంగా చందాలు వేసుకుని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నామని,సరిగ్గా అక్కడే ప్రత్యర్థులకు కన్నుకుట్టిందనీ,లక్షల రూపాయలు వెచ్చించి నిర్వహించిన ర్యాలీలకు కూడా కనీస స్పందన లేదని,వైయస్.జగన్మోహన్ రెడ్డి జన్మదినానికి వచ్చిన బడుగు, బలహీన వర్గాల్లో వచ్చిన స్పందన చూసి ఓర్చుకోలేక కుట్రలకు తెరతీశారనీ మరో సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు…..

అసలేం జరిగింది?
ఖమ్మంలో గత సంవత్సరం డిసెంబర్ 21 తారీఖున ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం ఘనంగా నిర్వహించారు,ఈ సందర్భంగా పెద్ద ఎత్తున జరిగిన బైక్ ర్యాలీలో జరిగిన చిన్న ఘటనను సాకుగా తీసుకుని పదకొండు మంది కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టీ పదిహేను రోజులపాటు జైలుకు పంపించారు,అప్పట్లో ఈ వార్త ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది, వాస్తవానికి జైలుకు పంపించబడిన వారంతా బీసీ,ఎస్సీ,వెనుకబడిన వర్గాలకు చెందిన వారు కావడం,వీరంతా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన వారు కావడం విశేషం,ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆలస్యం, సుధాకర్,మర్రి శ్రీనివాస్,నరేష్ లాంటి వాళ్లు బహిరంగంగానే
ఆనాటి బి.ఆర్.యస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేఖంగా ఎంతో కొంత సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేసిన వారే, కానీ ఆ సమయంలో ఇవేమీ వారికి గుర్తుకు రాలేదనీ, కేవలం ఒక సామాజిక వర్గం, తెలుగుదేశం పార్టీ ఒత్తిడితోనే వెనుకబడిన వర్గాల వారిని టార్గెట్ గా అక్రమ కేసులు బనాయించి జైళ్ల పాలు చేశారని అప్పట్లో విమర్శలు వచ్చాయి….

ఈ క్రమంలో జైలు నుండి విడుదలైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానులను వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్ రెడ్డి పరామర్శించారు,ఈ సందర్భంగా కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడుతూవైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించినందుకు వైఎస్సార్ అభిమానులపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు,అంతే కాకుండా వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల కోసం నిధులు ఎక్కడి నుండి వచ్చాయని,ఇతర పార్టీల నుంచి ఏమైనా సహాయం అందిందా అని పోలీసులు కార్యకర్తలను వేధించారని,ఈ ర్యాలీ వెనుక ఎవరి ప్రమేయం లేదని స్వచ్ఛందంగా మేమే నిర్వహించుకున్నామని ఎంత చెప్పినా వినకుండా, కాంగ్రెస్ ,పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి ఎనిమిది మంది కార్యకర్తలను రిమాండ్‌కు తరలించి పదమూడు రోజుల పాటు అక్రమంగా జైలులో బంధించారని అన్నారు,ఈ పాపం ఊరికే పోదని రాబోయే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ అక్రమ అరెస్టుల ప్రభావం ఖచ్చితంగా వెంటాడుతుందని అన్నారు….

ముఖ్యంగా తెలంగాణ క్యాబినెట్లో ఒక మంత్రి మరియు అతని కుమారుడు పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతూ, వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధించారనీ,ఇంతకు ఆ మంత్రి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా లేక తెలుగుదేశం పార్టీలో ఉన్నాడా అనే విషయం అర్ధం కావడం లేదని,ర్యాలీ టీడీపీ కార్యాలయం ముందు నుండి వెళ్లడమే నేరమా అని ప్రశ్నించారు,ఆంధ్రప్రదేశ్‌లో కూడా జగన్ అభిమానులపై ఇలాగే తప్పుడు కేసులు పెడుతున్నారని, కోడిని లేదా మేకను కోసినా కేసులు నమోదు చేస్తున్నారు,ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని,వచ్చే ఏడాది ఖమ్మంలో ఇంకా ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తామని రాబోయే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైయస్సార్ అభిమానుల సత్తా ఏమిటో కాంగ్రెస్ పార్టీకి చూపిస్తామని,త్వరలోనే ఖమ్మంలో వైయస్.జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉండబోతుందని,బాధితులను కలిసి పరామర్శించబోతున్నారని అన్నారు…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment