మంత్రి పొంగులేటి ఇంట సంక్రాంతి ఘుమ ఘుమలు!!

Pathi Sreenivas Rao
2 Min Read
The aroma of Sankranthi delicacies fills Ponguleti's Home in Khammam.....

ఖమ్మం: అధికార హోదా కన్నా ఆత్మీయతకే పెద్దపీట వేస్తోంది తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసం. సంక్రాంతి పండుగ అంటే కేవలం వేడుక మాత్రమే కాదు, తోటి మనుషుల నోరు తీపి చేయడమే అసలైన పండుగ అని చాటుతున్నారు ఆయన సతీమణి మాధురి. ప్రతీ ఏటా తమను నమ్ముకున్న వారికి రుచికరమైన పిండివంటలు అందించే ఆనవాయితీని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు…..

ఘుమఘుమలాడే పసందైన రుచులు….
ఖమ్మం శ్రీనగర్ కాలనీలోని మంత్రి క్యాంప్ కార్యాలయం ప్రస్తుతం ఓ పెద్ద వంటిల్లులా మారిపోయింది. నేతి అరిసెలు…. ఫ్లవర్ బాదుషాలు… మిక్చర్… నెలవంకలు వంటి నోరూరించే రుచులు అక్కడ సిద్ధమవుతున్నాయి. “మా కోసం నిరంతరం శ్రమించే సిబ్బంది కూడా మా కుటుంబ సభ్యులే” అని మాధురి పేర్కొన్నారు. బయట కొన్న స్వీట్ల కంటే తమ చేతులతో చేసి పెట్టే వంటకాల్లోనే నిజమైన ప్రేమ ఉంటుందని ఆమె నమ్మకం…..

…….Pathi Srinivas Rao

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment