ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ తరుపున ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూతనంగా ఎన్నికైన సర్పంచులు,ఉప సర్పంచుల అభినందన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు,అంతకు ముందు జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం టోల్ గేట్ వద్ద పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాలా ఉపేందర్ రెడ్డి నేతృత్వంలో పాలేరు నియోజకవర్గం బి.ఆర్.యస్ కార్యకర్తలు కేటీఆర్ కు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు…

సభలో మాట్లాడుతున్న బి.ఆర్.యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్….
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు,రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి రంగం సిద్ధమైంది,కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో క్లీన్ షిప్ చేస్తామని అన్నారు అదేవిధంగా ఖమ్మం ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది
ఆది పంచాయతీ ఎన్నికల్లో ప్రస్పుటం అయిందనీ,రెండేళ్ల పాలనలోనే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చిందంటే భవిష్యత్తులో అధికారంలోకి రాబోయేది బి.ఆర్.యస్ పార్టీనేనని మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు 40% గ్రామ పంచాయతీల్లో
బి.ఆర్.యస్ పార్టీని గెలిపించిస్పష్టమైన సంకేతాలు ఇచ్చారని తెలిపారు…..

సభలో మాట్లాడుతున్న బి.ఆర్.యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్….
ఖమ్మం జిల్లాను గోదావరి నీళ్లతో సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తొంబై శాతం ప్రాజెక్టు పనులు పూర్తి అయితే రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమిటనీ కేటీఆర్ ప్రశ్నించారు,జిల్లాలో మంత్రులు కేవలం కమీషన్ల కోసమే పని చేస్తున్నారనీ,అలీ బాబా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఖమ్మం జిల్లాల్లో ముగ్గురు మంత్రులు 30% కమీషన్లలో మునిగి తేలుతున్నారనీ ఎద్దేవా చేశారు….
ఖమ్మం జిల్లా అభివృద్దే లక్ష్యంగా కేసీఆర్ పని చేశారు. ఇప్పుడు ఇదే జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. కనీసం రైతులకు యూరియా ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నారు. కమీషన్ల కోసమే ఆ ముగ్గురు పని చేసేది. 30 శాతం ట్యాక్స్ నడిపిస్తున్నారు వాళ్లు. ఆరు గ్యారెంటీలు భద్రంగా పెట్టుకోండని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆనాడు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఇప్పుడు రెండేళ్లు అయినా గ్యారెంటీలు అమలు కాలేదు.దీనికి భట్టి ఏమి సమాధానం చెబుతారు? అని కేటీఆర్ ప్రశ్నించారు,అంతే కాకుండా జిల్లాలో ఒక మంత్రి అదానీ కాళ్లు పట్టుకుని బీజేపీ పార్టీలో చేరతానని ఈడి కేసులను మాఫీ చేసుకునే పనిలో ఉంటే మరో మంత్రి కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీలో చేరాలని బి.ఆర్.యస్.పార్టీ ర్పొరేటర్ల ఇంటి చుట్టూ తిరుగుతున్నాడని మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు…..

ర్యాలీలో కార్యకర్తలకు అభివాదం చేస్తున్న కేటీఆర్…
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఏనాడు యూరియా కష్టాలు లేవు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే లైన్‌లలో చెప్పులు కనిపిస్తున్నాయి.షాపుల్లో లేని యూరియా యాప్‌లలో ఎలా వస్తుందనీ,కాంగ్రెస్ పాలనలో ఎగవేతలు,కూల్చివేతలు తప్పా కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులు ఇచ్చారా? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చారా? రెండేళ్లలో ఏం అభివృద్ధి జరిగింది? కూల్చివేతలు, ఎగవేతలే కనిపిస్తున్నాయనీ,కాంగ్రెస్ ప్రభుత్వం సర్వభ్రష్ట ప్రభుత్వంగా మారిందని విమర్శలు గుప్పించాడు

కేటీఆర్ చేతికి “నాడ”ను కడుతున్న మైనారిటీ నాయకుడు సద్దాం అబ్దుల్….
ఈ సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి, హరిప్రియ నాయక్, మెచ్చా నాగేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్లు దిండిగల రాజేందర్ ఖమర్, మాజీ ఎమ్మెల్యేలు చంద్రావతి, తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు…..
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, ఖమ్మం:9703973456
