ఎవరైతే నాకేంటి ? అంతా నా ఇష్టం!!

Pathi Sreenivas Rao
3 Min Read
The Negligent attitude of an officer in the Khammam Agriculture Department...

ఖమ్మం జిల్లా: ది: 6:1:2026

అద్దె భవనాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యాలయాలు జనవరి ఒకటో తారీఖు వరకు అద్దె భవనాలు ఖాళీ చేసి ప్రభుత్వ భవనాల్లోకి మారాలని గత సంవత్సరం ది:20:12:2025 న Cercular Memo Number:3469202-A/310/WP/A1/2025 నెంబరుతో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది,కానీ ప్రభుత్వ ఆదేశాలను భేఖాతరు చేస్తూ ఊరంతా ఒక దారి అయితే ఉలిపిరి కట్టది ఒక దారి అన్నట్లు నా రూటే సపరేట్ అనే విధంగా ప్రవర్తిస్తున్నాడు ఖమ్మం వ్యవసాయ శాఖకు చెందిన ఓ అధికారి….

ప్రస్తుత ఖమ్మం వ్యవసాయ శాఖ ఏడి కార్యాలయం (కృషీ భవన్)….

విషయానికి వస్తే ఖమ్మం వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు కార్యాలయం (AD OFFICE) గత కొన్నేండ్లుగా నిబంధనలకు విరుద్ధంగా “కృషి భవన్” అనే ప్రైవేట్ బిల్డింగులో కొనసాగుతుంది,మొదట ఈ కార్యాలయం గత పదిహేను సంవత్సరాలుగా స్థానిక బైపాస్ రోడ్డులోనీ హోల్ సేల్ కూరగాయల మార్కెట్ యార్డ్ పై అంతస్తులో ఉండేది సదరు అధికారి జాయిన్ అయ్యాక అక్కడ ఏం జరిగిందో తెలియదు గాని కార్యాలయాన్ని గట్టయ్య సెంటర్లోని బి.సి ల్యాబ్ లోకి మార్చారు, కానీ అక్కడ కూడా ఎన్నో రోజులు ఉంచలేదు,కొద్ది రోజులకే అద్దె భవనం అయిన “కృషి భవన్”లోకి మార్చారు,పిల్లి తన కూనలను స్థావరాలు మార్చినట్లు ఇష్టం వచ్చినట్లు రెండు సంవత్సరాల వ్యవధిలో రెండుసార్లు కార్యాలయాన్ని మార్చారు, దీంతో పదే కార్యాలయాన్ని మారుస్తుండడంతో రైతులకు అడ్రస్ దొరకక నానా ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితులు నెలకొని ఉన్నాయి,తన ఇష్టానుసారం అద్దె భవనంలోకి మారినప్పటికీ అద్దె చెల్లింపు విషయంలో ఒక రాష్ట్ర స్థాయి యూనియన్ నాయకునికి సదరు అధికారికి మధ్య ఓ సమావేశంలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తుంది….

ఇదే విషయం మీద జిల్లా జాయింట్ కలెక్టర్,జిల్లా వ్యవసాయ అధికారి కూడా అదేశాలు చేశారు కానీ తనకున్న రాజకీయ పలుకుబడి,సామాజిక వర్గం అండదండలతో వారి ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ఈరోజుకి సదరు అధికారి కార్యాలయాన్ని ఖాళీ చేయలేదు,ఇంత జరుగుతున్న ఆ అధికారి విషయంలో మాట్లాడడానికి జిల్లా అధికారులు సైతం వెనకడుగు వేస్తున్నారంటే ఆయన పలుకుబడి ఏ స్థాయిలో ఉందనే విషయం ఇట్లే అర్థం అవుతుంది,ఒక విధంగా చెప్పాలంటే గతంలో ఈ కార్యాలయం ఉన్న హోల్ సేల్ కూరగాయల మార్కెట్ యార్డ్,బీసీ ల్యాబ్ తో సహా DRDA భవనం కూడా ఖాళీగా అందుబాటులో ఉన్నాయి కానీ ఎందుకో సదరు అధికారికి “ప్రభుత్వ భవనాలు వద్దు అద్దె భవనాలు ముద్దు” అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు…..

ఒకవైపు ప్రభుత్వ అదేశాలు,మరోవైపు జిల్లా అధికారుల ఆదేశాలను ధిక్కరిస్తూ ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను వదిలేసి అద్దె భవనంలో కార్యాలయం ఎందుకు నడపాల్సి వస్తుంది,దీనికి వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అంతుచిక్కని సమస్యలా తయారయ్యిందంటు అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు,పదే పదే కార్యాలయాన్ని మారుస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారిపై చర్యలు తీసుకుని,కార్యాలయాన్ని రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఒక పర్మినెంట్ ప్లేస్ లో ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు….

📄 Generate e-Paper Clip
Share This Article