రాష్ట్రంలోనే పాలేరును ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం….మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…

Pathi Sreenivas Rao
1 Min Read
Highlights
  • రాష్ట్రంలోనే పాలేరును ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం....
  • అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి.. నాణ్యతలో రాజీ వద్దు....
  • కూసుమంచి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సుదీర్ఘ సమీక్ష....

కూసుమంచి: పాలేరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని దిశానిర్దేశం చేయడం జరిగింది. నియోజకవర్గంలో కొనసాగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేసి, వాటి ఫలాలను ప్రజలకు త్వరితగతిన అందించాలని అధికారులను ఆదేశించారు.ఈ రోజు కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధి పురోగతిపై ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌తో పాటు వివిధ శాఖల అధికారులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు…

భివృద్ధి పనుల నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. నిర్దేశించిన గడువులోగా పనులన్నీ పూర్తి చేసి, సత్వరమే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.అదే విధంగా అభివృద్ధి పనులు వేగంగా సాగాలంటే వివిధ ప్రభుత్వ శాఖల మధ్య పటిష్టమైన సమన్వయం అత్యంత కీలకమని, అధికారులు ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.నియోజకవర్గ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో భూముల రీ-సర్వే ప్రక్రియను చేపట్టేందుకు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు….

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా ఇటీవల విజయవంతంగా నిర్వహించిన ‘ప్రజా దర్బార్’లో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని స్పష్టం చేశారు.అంతే కాకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఈ సందర్భంగా అధికారులకు తెలియజేశారు.అధికారులు, యంత్రాంగం అంతా ఒకే తాటిపై నడిచి పాలేరు నియోజకవర్గ ప్రగతికి కృషి చేయాలని, రాష్ట్రానికే రోల్ మోడల్‌గా నిలిపేలా అంకితభావంతో ముందుకు సాగాలని ఈ సమావేశంలో పిలుపునిచ్చారు…..

📄 Generate e-Paper Clip
Share This Article