తెలంగాణ /ఖమ్మం జిల్లా :
నేలకొండపల్లి: మండలంలోని బోదులబండ గ్రామం రాజకీయ, ఆధ్యాత్మిక శోభతో పులకించిపోయింది. గ్రామంలో ఆదివారం కనులపండువగా నిర్వహించిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (శీనన్న) ముఖ్య అతిథిగా విచ్చేశారు. జననేత రాకతో బోదులబండ గ్రామం ఒక్కసారిగా కోలాహలంగా మారింది…మంగళవాయిద్యాల మోతలు, భక్తుల జయజయధ్వానాలు, పూర్ణకుంభ స్వాగతం నడుమ ఆలయానికి చేరుకున్న మంత్రి పొంగులేటి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దివ్య స్వరూపాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని, అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రి పొంగులేటికి వేదమంత్రాల నడుమ ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను బహూకరించారు…..

ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని పురస్కరించుకుని భక్తుల కోసం ఏర్పాటు చేసిన మహా అన్నదాన వితరణ కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కేవలం ప్రారంభించడానికే పరిమితం కాకుండా, స్వయంగా భక్తులకు వడ్డించి తన ఉదారతను చాటుకున్నారు. మంత్రి స్వయంగా వడ్డించడంతో భక్తులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఇలాంటి ఆధ్యాత్మిక వేడుకలు ప్రజల మధ్య ఐక్యతను, సౌభ్రాతృత్వాన్ని మరింత పెంపొందిస్తాయని పేర్కొన్నారు….

ముత్యాలమ్మ అమ్మవారి కృపాకటాక్షాలతో రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు..సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, తెలంగాణ రాష్ట్రం పాడిపంటలతో సస్యశ్యామలం కావాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు..గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి, సంక్షేమానికి తమ ప్రభుత్వం నిరంతరం కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి తరలివచ్చిన భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు…..
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456
