తెలంగాణ /ఖమ్మం జిల్లా :
వైరా/లాలాపురం (రిపోర్టర్ సత్తేనపల్లి శివ ):
అధికార కాంగ్రెస్ పార్టీ నేతల బెదిరింపులకు, అక్రమ కేసులకు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఏమాత్రం అధైర్యపడవద్దని.. పార్టీ నాయకత్వం ప్రతి ఒక్కరికీ అండగా ఉంటుందని రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు లాలాపురం గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేలా ఆయన ప్రసంగించారు.ఈ సందర్బంగా లాలాపురం గ్రామానికి చెందిన ప్రముఖులు, గ్రామ పెద్ద దామా సీతారామయ్య ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, నేరుగా ఆయన నివాసానికి వెళ్లి సీతారామయ్యను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు…..

పరామర్శ అనంతరం అదే నివాసంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో పువ్వాడ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.ఈసమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ప్రత్యర్థి పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగా పెడుతున్న అక్రమ కేసులకు, చేస్తున్న బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ పార్టీ పెద్ద దిక్కుగా నిలబడుతుందని ఆయన కార్యకర్తలకు భరోసా ఇచ్చారు…..

ఈ కార్యక్రమంలో మాజీ సుడా (SUDA) చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,గుండాల కృష్ణ,పగడాల నాగరాజు,లకావత్ గిరిబాబు,కట్టా కృష్ణార్జున రావు,పోట్ల శ్రీనివాసరావు,వనమా విశ్వేశ్వరరావు,బాణాల వెంకటేశ్వర్లు,దామా లలిత్ చౌదరి,మద్దెల రవి తదితర నాయకులు, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు…..
పత్తి శ్రీనివాస్,జనం ముచ్చట న్యూస్,హైదరాబాద్ :9703973456
