ఏపీ నుంచి ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం :రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి!!

Pathi Sreenivas Rao
2 Min Read
Highlights
  • ఏపీ నుంచి ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం....
  • రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టును తనిఖీ చేసిన ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి....
  • అక్రమంగా తరలిస్తే వాహనాలు సీజ్, క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరిక.....

ముదిగొండ,జూన్ 28:పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు సాగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇసుక మాఫియా పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని, అక్రమ రవాణాను ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.ఆదివారం ఆయన ముదిగొండ సీఐ మురళితో కలిసి ముదిగొండ మండలం, రాష్ట్ర సరిహద్దులోని మల్కాపురం క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ వద్ద రికార్డులను పరిశీలించి, సరిహద్దు పోలీస్ స్టేషన్ల అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు….

ఇసుక అక్రమ రవాణాకు అవకాశం ఉన్న అన్ని మార్గాల్లో నిరంతర పర్యవేక్షణ ఉంచాలి. స్మగ్లర్లు ఏ మార్గం గుండా కూడా ఇసుకను దాటించకుండా పకడ్బందీగా వ్యవహరించాలని,సరిహద్దులు దాటి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తిస్తే తక్షణమే ఆయా లారీలు, ఇతర వాహనాలను సీజ్ చేయాలని  ఇసుకను అక్రమంగా రవాణా చేసినా, ఎక్కడైనా అక్రమంగా నిల్వ ఉంచినా వెంటనే చట్ట ప్రకారం భారీ జరిమానాలు విధించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆద్దెశించారు,….

అలాగే ఖమ్మం రూరల్ పరిధిలో ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్‌పోస్టుల్లో పోలీస్ సిబ్బంది మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు (రాత్రి, పగలు) విధుల్లో అప్రమత్తంగా ఉండాలి.సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక చెక్‌పోస్టుల ద్వారా ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిర్మూలించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఏసీపీ దిశానిర్దేశం చేశారు. నిబంధనలు అతిక్రమించి ఇసుక వ్యాపారం చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఇసుక అక్రమ రవాణాదారులను ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు……

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment