బాధితులకు ‘మదన్ లాల్’ కుటుంబం భరోసా: విప్పలమడకలో బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ!!

Pathi Sreenivas Rao
2 Min Read

వైరా, జూన్ 15 (రిపోర్టర్ ఎస్.శివ ):
వైరా నియోజకవర్గంలో భారత్ రాష్ట్ర సమితి (BRS) శ్రేణులకు, ప్రజలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ కుమార్తె, బి.ఆర్.ఎస్ యువ నాయకురాలు బానోత్ మనీషా లక్ష్మి స్పష్టం చేశారు. వైరా మండలం విప్పలమడక గ్రామంలో ఇటీవల వివిధ కారణాలతో మరణించిన పార్టీ కార్యకర్తలు, స్థానికుల కుటుంబాలను ఆమె సోమవారం పరామర్శించారు.గత రాత్రి మరణించిన ముత్తమాల పుల్లమ్మ, మూడు రోజుల క్రితం కన్నుమూసిన తేళ్లూరి కల్యాణ్, అలాగే కొన్ని రోజుల క్రితం మరణించిన తేళ్లూరి సులేమాన్ కుటుంబ సభ్యులను మనీషా లక్ష్మి స్వయంగా కలిసి ఓదార్చారు. వారి మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.కేవలం పరామర్శలకే పరిమితం కాకుండా, బాధితులకు తక్షణ సహాయంగా మదన్ లాల్ కుటుంబం తరఫున మానవతా దృక్పథంతో ఆర్థిక, వస్తు సహాయాన్ని అందించారు. మరణించిన మూడు కుటుంబాలకు 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులను మనీషా లక్ష్మి చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఏ కష్టం వచ్చినా తమ కుటుంబం వెన్నంటి ఉంటుందని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు….

ఈ సందర్భంగా విప్పలమడకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బానోత్ మనీషా లక్ష్మి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
“రాష్ట్రంలో ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని రాబోయేది ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వమేనని.పార్టీ కోసం రాత్రింబగళ్లు కష్టపడే ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టి చూసుకునే ఏకైక పార్టీ బి.ఆర్.ఎస్.పార్టీ అని,అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీస్సులతో వైరా నియోజకవర్గంలోని ప్రతి బి.ఆర్.ఎస్ కార్యకర్తకు మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ కుటుంబం ఎల్లవేళలా అండగా ఉంటుందని కార్యకర్తలు ఎవరూ అధైర్య పడవద్దని బానోత్ మనీషా లక్ష్మి అన్నారు….

తెలంగాణ ఉద్యమ కాలం నుండి వైరా నియోజకవర్గంలో బి.ఆర్.ఎస్ పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ నాయకత్వంలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం అధికారంలో లేకపోయినప్పటికీ, ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములవుతూ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మదన్ లాల్ కుటుంబం విస్తృతంగా పర్యటిస్తోంది. ముఖ్యంగా యువ నాయకత్వం ప్రజల్లోకి దూసుకువెళ్లడం క్యాడర్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ వైరా మండల ముఖ్య నాయకులు, విప్పలమడక గ్రామ కమిటీ ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు….

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment