ఖమ్మంలో రాజకీయ దుమారం: బీఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవి గ్రానైట్ కంపెనీలపై వరుస విజిలెన్స్ దాడులు!!

Pathi Sreenivas Rao
4 Min Read

హైదరాబాద్ : ఉమ్మడి ఖమ్మం,వరంగల్ జిల్లాల్లో రాజకీయాలు వేడెక్కాయి. ప్రధానంగా బీఆర్ఎస్ (BRS) రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ వ్యాపారవేత్త వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) లక్ష్యంగా జరుగుతున్న వరుస విజిలెన్స్ దాడులు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి,ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో విస్తృతమైన గ్రానైట్ వ్యాపారం ఉన్న గాయత్రి రవికి చెందిన క్వారీలు, కంపెనీల్లో కొద్ది రోజులుగా రాష్ట్ర విజిలెన్స్ అధికారులు అత్యంత గోప్యంగా ముమ్మర తనిఖీలు చేపట్టారు. అయితే, ఇదంతా కేవలం అక్రమాల వెలికితీత కోసం జరుగుతోందా, లేక దీని వెనుక రాజకీయ కక్ష సాధింపు ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.గత 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలోని కొందరు ముఖ్య నేతలు వద్దిరాజు రవిచంద్రను కాంగ్రెస్ తరఫున ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా బరిలో దించాలని గట్టిగా ప్రయత్నించారట. కానీ అందుకు ఆయన ససేమిరా అనడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు విధేయుడిగా ఉండిపోయారు.
ఈ పరిణామంతో ఆగ్రహించిన ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆయన వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయిస్తోందనే గుసగుసలు పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి……

వద్దిరాజు రవిచంద్ర బీసీ (కాపు) సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత. ఒకప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్న ఆయన 2018లో వరంగల్ తూర్పు నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరడం, కేసీఆర్ ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించడం, ఆ పదవీకాలాన్ని రెన్యువల్ చేయడం తెలిసిందే. కేసీఆర్, హరీష్ రావు లాంటి అగ్ర నేతలకు ఆయన అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని ముందుండి నడిపిస్తున్నారు.రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ప్రధాన సామాజిక వర్గమైన మున్నూరుకాపు సామాజిక వర్గంతో పాటు ఇతర బీసీ, ఎస్సి, ఎస్టీ మైనారిటి వర్గాలను కలుపుకుని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,నామా నాగేశ్వరావు,సండ్ర వెంకట వీరయ్య, తాత మధు,అర్జెసి కృష్ణ లాంటి సీనియర్ నాయకులను సమన్వయం చేసుకుంటూ,ప్రస్తుతం ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడం ద్వారా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పై గులాబీ జెండా ఎగరేయడానికి గాయత్రి రవి పావులు కడుపుతున్నట్లు అధికార పార్టీని కలవరానికి గురించేసింది,ఈ క్రమంలోనే జిల్లాలో ప్రతిపక్షాన్ని ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బతీయాలంటే ముందుగా గాయత్రి రవిని టార్గెట్ చేయాలన్నదే అధికార పార్టీ వ్యూహం రచించినట్లు బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి,ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గాల్లో ఒకటైన మున్నూరు కాపు సామాజిక వర్గానికి మంత్రి వర్గంలో కానీ ఇటు నామినేటెడ్ పదవుల్లో గానీ సరైన ప్రాధాన్యత దక్కలేదని ఇంటా బయట విమర్శలు విమర్శలు ఎదురుకుంటున్న వేల మున్నూరు కాపు సామాజిక వర్గంలో బలమైన, గట్టి పట్టున్న వద్దిరాజు రవిచంద్రపై విజిలెన్స్ దాడులు జరపడం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అంశంగా కాంగ్రెస్ పార్టులోని మున్నూరు కాపులు భావిస్తున్నారు…..

గాయత్రి రవి గ్రానైట్ వ్యాపారాలపై దాడులు జరగడం ఇదే తొలిసారి కాదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో (2022 నవంబర్‌లో) కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు ఆయన కార్యాలయాలపై భారీ ఎత్తున దాడులు చేశారు. ఫెమా (FEMA) నిబంధనలు ఉల్లంఘించి విదేశాలకు గ్రానైట్ ఎగుమతులు చేశారని, హవాలా లావాదేవీలు జరిగాయని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ నేతలను టార్గెట్ చేస్తోందని బీఆర్ఎస్ ఎదురుదాడి చేసింది. నాడు కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేయగా, నేడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఏకంగా రాష్ట్ర విజిలెన్స్ విభాగమే ఆయనపై వరుస దాడులకు దిగడం గమనార్హం…..

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న ఒక మంత్రికి గతంలో గాయత్రి రవి ‘రైట్ హ్యాండ్’ లాగా ఉండేవారు. ఇప్పుడు తనపై జరుగుతున్న దాడులు, వేధింపుల గురించి రవి సదరు మంత్రి వద్ద ప్రస్తావించగా.. “నా చేతిలో ఏమీ లేదు” అంటూ ఆయన నిస్సహాయత వ్యక్తం చేసినట్లు సమాచారం మరోవైపు ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్నూరు కాపులకు బలమైన అడ్డాగా ఉన్న కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది అదే విధంగా కేవలం గాయత్రి రవి మాత్రమే కాకుండా జిల్లాలోని ఇతర బి.ఆర్.ఎస్ నాయకులపై ఇదే రకమైన ఒత్తిల్లు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది, వ్యాపారవేత్తగా (1992లో గాయత్రి గ్రానైట్స్ స్థాపన), రాజకీయ నాయకుడిగా తనకంటూ ఒక బలమైన ముద్ర వేసుకున్న వద్దిరాజు రవిచంద్రను అటు కేంద్ర సంస్థలు, ఇటు రాష్ట్ర సంస్థలు రెండు వైపుల నుంచి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే, ఈ విజిలెన్స్ ఉచ్చును ఛేదించి రవి రాజకీయంగా ఎలా నిలబడతారన్నది ఇప్పుడు ఉమ్మడి జిల్లాల రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment