తెలంగాణ/హైదరాబాద్:
హైదరాబాద్:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జగదీశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ మాటలు చాలా అపరిపక్వంగా (Immature) ఉన్నాయని, గాలిలో శూన్యంలో ఊహించుకుని మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రాజకీయాల్లో సినిమా డైలాగులు పనిచేయవని చురకలంటించారు….
తెలంగాణ ప్రజల దయ వల్లే పవన్ ఎదుగుదల….
ఎవరో అనామకులు ఏదో అన్నారని, మొత్తం తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడటం పవన్ కళ్యాణ్ కు తగదని జగదీశ్ రెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్ ఎదుగుదలలో ప్రతి అంగుళం తెలంగాణ ప్రజల దయ, దాక్షిణ్యం ఉన్నాయని, తెలంగాణ ప్రజలే ఆయనకు బువ్వ పెట్టి ఆదరించారని గుర్తుచేశారు,రైతులు, నిరుద్యోగులు, యువత, మరియు విద్యార్థులు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ పార్టీ మరియు పవన్ కళ్యాణ్ కలిసి ఆడుతున్న డ్రామా ఇది అని ఆయన ఆరోపించారు…
సినిమా డైలాగులు వద్దు….
నేను అది చేస్తా, ఇది పీకుతా, నరుకుతా లాంటి పిచ్చి మాటలను రాజకీయాల్లో పక్కనపెట్టాలని జగదీశ్ రెడ్డి హితవు పలికారు. రాజకీయాల్లో ఎవరినీ ఎవరూ పీకలేరని, ప్రజల తలరాతలు రాసేది, భవిష్యత్తును నిర్ణయించేది అంతిమంగా ప్రజలే అని స్పష్టం చేశారు,పవన్ కళ్యాణ్ కు రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ గురించి కనీస జ్ఞానం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అనేది పార్లమెంట్ ద్వారానే జరుగుతుందన్న విషయం ఆయనకు తెలియదన్నారు. ఎవరో డైలాగ్ రైటర్ రాసిస్తే చదివే అలవాటున్న పవన్, ఇప్పుడు కూడా ఎవరో రాసిచ్చిన మాటలనే మాట్లాడుతున్నారని విమర్శించారు….
ఎవరూ ఎవరి ప్రయాణాన్ని ఆపలేరు….
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావడాన్ని గానీ, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లడాన్ని గానీ ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. సభలకు అనుమతి దొరకకపోవడం అనేది ప్రభుత్వ చేతగానితనం అని, ఒకవేళ పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టుకుంటే తెలంగాణలో శాంతిభద్రతల సమస్య ఎందుకు వస్తుందని ఆయన ప్రశ్నించారు,గతంలో తమ నేతలు కేటీఆర్ సభలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే కోర్టు ద్వారా తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు,బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతి పదం ఆలోచించి మాట్లాడాలని, ఎవరో పేరు లేని వ్యక్తులు అన్న మాటలకు తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడటం సరైన పద్ధతి కాదని జగదీశ్ రెడ్డి సూచించారు. ఇదంతా కేవలం ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే నాటకం మాత్రమేనని ఆయన తేల్చిచెప్పారు…..
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
