జన్వాడ ‘కోడి చెరువు’ను కబ్జా చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్? సంచలన ఆధారాలు బయటపెట్టిన ‘మన తొలివెలుగు రఘు !!

Pathi Sreenivas Rao
2 Min Read

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తెలంగాణలో సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. రంగారెడ్డి జిల్లా, శంకరపల్లి మండలం, జన్వాడ గ్రామంలోని ‘కోడి చెరువు’కు చెందిన సుమారు 10 ఎకరాల భూమిని పవన్ కళ్యాణ్ అక్రమంగా తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ‘మన తొలివెలుగు టీవీ’ ఒక కథనంలో తీవ్ర ఆరోపణలు చేసింది ఇందుకు సంబంధించిన భూ రికార్డులు, ఎలక్షన్ అఫిడవిట్ వివరాలను వీడియోలో ఆధారాలతో సహా బయటపెట్టింది….

జన్వాడలోని సర్వే నంబర్ 706 పూర్తిగా ‘కోడి చెరువు’ ఎఫ్టీఎల్ (Full Tank Level) మరియు బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందని వీడియోలో పేర్కొన్నారు ఆర్వీ అసోసియేట్స్ చేసిన సర్వే మ్యాప్‌ల ప్రకారం.. సర్వే నెంబర్ 706 లోని మొత్తం 13 ఎకరాల 13 గుంటల విస్తీర్ణంలో, 10 ఎకరాల 6 గుంటలు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉందని స్పష్టం చేశారు, 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో (పిఠాపురం) పవన్ కళ్యాణ్ సమర్పించిన అఫిడవిట్‌లో (పేజీ నెంబర్ 20) ఈ భూమి ప్రస్తావన ఉంది 15 డిసెంబర్ 2014న 10 ఎకరాల భూమిని రూ. 2.76 కోట్లకు కొనుగోలు చేసినట్లు అందులో పేర్కొన్నారు…..

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో 10 ఎకరాలను ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ, రెవెన్యూ రికార్డుల్లో (మ్యుటేషన్) మాత్రం ఒకేసారి ఎక్కిస్తే దొరికిపోతామన్న ఉద్దేశ్యంతో.. అధికారుల సాయంతో విడతల వారీగా (3.04 ఎకరాలు, 3.12 ఎకరాలు, 3.14 ఎకరాలు, మరియు 10 గుంటలు) మ్యుటేషన్ చేయించుకున్నారని ఆరోపించారు,తెలంగాణ ప్రభుత్వ భూభారతి/ధరణి రికార్డులలో పవన్ కళ్యాణ్ పేరిట ఉన్న ఈ భూమి క్లాసిఫికేషన్ (Classification of Land) స్పష్టంగా “శికం” (చెరువు భూమి) అని రికార్డుల్లో ఉందని వీడియోలో ఆధారాలు చూపించారు….

తెలంగాణలో చెరువుల కబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్న ‘హైడ్రా’ ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉందని రిపోర్టర్ ప్రశ్నించారు.ప్రస్తుతం ఈ 10 ఎకరాల భూమి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 500 కోట్లు ఉంటుందని అంచనా వేశారు  ధర్మం, న్యాయం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్.. తెలంగాణ జాతి సంపద అయిన కోడి చెరువును కబ్జా చేయడం సమంజసం కాదని, తక్షణమే పవన్ కళ్యాణ్ బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పి ఆ చెరువు భూమిని తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని రిపోర్టర్ డిమాండ్ చేశారు….

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment