తెలంగాణ/ఖమ్మం జిల్లా:
పాలేరు, మే 13:నియోజకవర్గ పరిధిలోని రైతుల సమస్యలు తెలుసుకోవడమే కాకుండా, ధాన్యం కొనుగోలు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించేందుకు రాష్ట్ర మంత్రులు రేపు పాలేరుకు రానున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం పాలేరు గ్రామ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించనున్నారు.ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు…..
క్షేత్రస్థాయిలో పరిశీలన.. రైతులతో ముఖాముఖి….
మంత్రులు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు నేరుగా కొనుగోలు కేంద్రానికి చేరుకుంటారు. ఈ పర్యటనలో ప్రధానంగా ఈ క్రింది అంశాలపై మంత్రులు దృష్టి సారించనున్నారు, ప్రస్తుతం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న ధాన్యం సేకరణ తీరును పరిశీలిస్తారు.రైతులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర అందుతుందా? లేదా? అనే విషయాన్ని స్వయంగా అడిగి తెలుసుకుంటారు.తూకంలో మోసాలు జరగకుండా తీసుకుంటున్న చర్యలు, గోనె సంచుల లభ్యతను పర్యవేక్షిస్తారు, సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించే ప్రక్రియను సమీక్షిస్తారు,రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. క్షేత్రస్థాయిలో కొనుగోలు ప్రక్రియను పరిశీలించి, ఏవైనా అడ్డంకులు ఉంటే మంత్రులు అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు….
భారీగా తరలిరావాలని పిలుపు…..
మంత్రుల పర్యటన నేపథ్యంలో పాలేరు నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు సోదరులు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు. మంత్రుల రాక నేపథ్యంలో అధికారులు కొనుగోలు కేంద్రం వద్ద ఏర్పాట్లను పూర్తి చేశారు……
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
