తెలంగాణ /హైదరాబాద్:
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతూ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరధ్‌పై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఫిర్యాదుతో పేట్ బషీరాబాద్ పోలీసులు ఆయనపై పోక్సో (POCSO) చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించారు.తమ 17 ఏళ్ల మైనర్ కుమార్తెకు మద్యం తాగించి, సాయి భగీరధ్ అత్యాచారానికి పాల్పడ్డారని వారు ఆరోపించారు.మొయినాబాద్ ప్రాంతంలోని ఒక ఫార్మ్ హౌజ్‌తో పాటు, మరో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈ దారుణం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు….
సాయి భగీరద్ పై పలు సెక్షన్ల కింద నమోదు…..
సాయి భగీరధ్ వేధింపులు, జరిగిన అవమానం భరించలేక తమ కుమార్తె రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.తమ బిడ్డకు న్యాయం చేయాల్సింది పోయి, కేసు నుండి తప్పించుకునేందుకు సాయి భగీరధ్ రివర్స్‌లో తమ కుమార్తెపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.బాధితుల ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు బండి సాయి భగీరధ్‌పై BNS 74, 75: లైంగిక వేధింపులు మరియు దౌర్జన్యానికి సంబంధించిన సెక్షన్లు.సెక్షన్ 11 r/w 12 (POCSO Act): మైనర్లపై లైంగిక దాడులకు సంబంధించిన కఠిన చట్టం కింద కేసు ఫైల్ చేశారు….
పరస్పర విరుద్ధ వాదనలు: హనీ ట్రాప్ వర్సెస్ అత్యాచారం….
ఈ వ్యవహారంపై బండి సంజయ్ వర్గీయులు మరో వాదనను తెరపైకి తెచ్చారు. కేంద్ర మంత్రి కొడుకుపై హనీట్రాప్ అస్త్రం విసిరి,ఒక మహిళ తన కూతురిని అడ్డుపెట్టుకొని బండి సంజయ్ కుమారుడిని హనీట్రాప్‌లోకి దించే ప్రయత్నం చేసిందని.పక్కా పథకం ప్రకారం వ్యవహరించిన సదరు మహిళ, ఆ తర్వాత భారీగా డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు దిగిందని,వేధింపులు మరియు బెదిరింపులు ఎక్కువవడంతో, బండి సంజయ్ కుమారుడు సదరు మహిళపై కరీంనగర్‌లో ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు, కోట్ల రూపాయలు వసూలు చేయాలని (Extortion), తనను లొంగదీసుకోవాలని చూస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు అంతే కాకుండా సదరు మహిళ తన కుమార్తె వయస్సును తప్పుగా చూపిస్తూ ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని.మైనర్ అమ్మాయిని వేధించారని “పోక్సో” కేసు పెడతా అంటూ మీడియా ద్వారా రచ్చ చేస్తూ భయాందోళనకు గురిచేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు..ఆశించిన మేరకు డబ్బులు రాకపోవడంతో, సదరు మహిళ మీడియాను ఆశ్రయించి ఈ వ్యవహారాన్ని వివాదాస్పదం చేస్తోందని కేవలం ఆర్థికంగా ప్రయోజనం పొందేందుకే సాయి భగీరధ్‌ను‘హనీ ట్రాప్’ చేశారని, నిందితులు ఆయన నుండి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని వారు చెప్పుకొస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పటికే 50 వేల రూపాయలు చెల్లించామని వారు వెల్లడించారు.అయితే, సంజయ్ వర్గం చేస్తున్న వాదనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఏ తప్పూ చేయనప్పుడు 50 వేల రూపాయలు ఎందుకు చెల్లించారు?” అని బాధితుల తరపు వారు ప్రశ్నిస్తున్నారు. బ్లాక్ మెయిల్ జరుగుతుంటే పోలీసులను ఆశ్రయించకుండా డబ్బులు ఇవ్వడం వెనుక ఏదో మర్మం ఉందనే చర్చ సర్వత్రా సాగుతోంది…..
రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న పోక్సో కేసు….
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపైనే పోక్సో కేసు నమోదు కావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది.ఈ కేసులో పోలీసులు తదుపరి విచారణను వేగవంతం చేశారు.బాధితురాలికి న్యాయం జరుగుతుందా? లేక రాజకీయ ఒత్తిళ్ల మధ్య ఈ కేసు మరుగున పడుతుందా? అన్నది ఇప్పుడు వేచి చూడాలి….
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
