దిల్‌సుఖ్‌నగర్‌లో అర్ధరాత్రి ఆపరేషన్: ఐపీఎస్ అధికారిణికే వేధింపులు !!

Pathi Sreenivas Rao
2 Min Read
ఐపీఎస్ అధికారిణికే తప్పని వేధింపులు: అర్ధరాత్రి 'షీ టీమ్స్' స్పెషల్ ఆపరేషన్.. 40 మంది పోకిరీలు అరెస్ట్!

హైదరాబాద్: నగరంలోని దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన మహిళల భద్రతపై మరోసారి ఆందోళన కలిగిస్తోంది.నగరంలో మహిళల రక్షణ కోసం పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, పోకిరీల ఆగడాలు తగ్గడం లేదు.సామాన్య మహిళలకే కాదు,ఏకంగా ఒక ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారిణికే వేధింపులు ఎదురయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మల్కాజ్‌గిరి డీసీపీ (ప్రస్తుతం ఐజీ స్థాయి అధికారిణి) సుమతి స్వయంగా రంగంలోకి దిగి నిర్వహించిన ‘స్పెషల్ ఆపరేషన్’లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి….

మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో సుమతి, సాధారణ మహిళలా వేషం వేసుకుని రోడ్డుపై నిల్చున్నారు.ఒంటరిగా ఉన్న మహిళను చూడగానే రెచ్చిపోయిన కొందరు కామాంధులు, ఆమె ఒక పోలీస్ అధికారిణి అని తెలియక అసభ్యకరంగా ప్రవర్తించారు. “వస్తావా? రేటెంత?” అంటూ అసభ్య పదజాలంతో వేధించారు.బైక్‌లపై వెళ్తూ సైగలు చేయడం, వెంటాడటం వంటి పనులకు పాల్పడ్డారు. దాదాపు అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3:30 గంటల వరకు ఈ స్పెషల్ ఆపరేషన్ కొనసాగింది,​పోకిరీల ఆగడాలు మితిమీరడంతో,మాటు వేసిన పోలీసులు ఒక్కసారిగా దాడి చేసి 40 మందిని అదుపులోకి తీసుకున్నారు.పట్టుబడ్డ వారి వివరాలు చూసి పోలీసులు షాక్‌కు గురయ్యారు,వీరందరినీ స్టేషన్‌కు తరలించి,తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు, ఈ మొత్తం వ్యవహారంలో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే పట్టుబడిన పోకిరీలలో చాలా మంది విద్యార్థులు మరియు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కావడం గమనార్హం. కొందరు గంజాయి మత్తులో ఉన్నట్లు కూడా పోలీసుల విచారణలో తేలింది…..

​​​ఒక ఐపీఎస్ అధికారిణికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. అత్యవసర పరిస్థితుల్లో అర్ధరాత్రి బయటకు వచ్చే సాధారణ మహిళల పరిస్థితి ఏంటి? సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతో ఉంది.” అని ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది.ఈ క్రమంలో రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళలకు ​పోలీసులు పలు సూచనలు చేశారు,​మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నగరంలో షీ టీమ్స్ నిఘా నిరంతరం ఉంటుందని, పోకిరీల ఆటలు సాగనివ్వమని స్పష్టం చేశారు. బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే 100 లేదా షీ టీమ్స్ వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు……

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment