తెలంగాణ/ఖమ్మం జిల్లా:
ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట “రైతు మహా ధర్నా” కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తాత మధు,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య,కందాల ఉపేందర్ రెడ్డిలతో కలిసి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు,ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని,వరికి మద్దతు ధర ఇవ్వాలని,వెంటనే ప్రభుత్వం దిగివచ్చి ఖమ్మం జిల్లాలో పండిన అన్ని పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేసారు….

ఖమ్మం కలక్టరేట్ ఎదురుగా జరిగిన “రైతు మహాధర్నా”లో జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు….
అంతే కాకుండా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వండి వార్చినా వడ్డించడం చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తేలుతుందని,రేవంత్ రెడ్డి అసమర్ధ పాలన వల్లే రాష్ట్రంలో ఎన్నో అరిష్టాలు జరుగుతున్నాయని అన్నారు.అందుకే రేవంత్ పోవాలి కేసీఆర్ రావాలని అన్నారు,అదే విధంగా మనిషిని మనిషి ముట్టుకోవడానికి భయపడే “కరోనా”
సమయంలో కూడా ప్రతి గింజ కొనుగోలు చేసిన చరిత్ర కేసీఆర్ దని,రాష్ట్రంలో యూరియా కోసం నానా తిప్పలు పడుతున్నారని షాపుల్లో లేని యూరియా యాపుల్లోఎక్కడి నుంచి వస్తుందని ఎద్దేవా చేశారు,కనీసం రైతులకు యూరియా ఇవ్వడం చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని, ఎన్నో కష్టాలు భరించి రైతులు పంట పండిస్తే కొనుగోలు కేంద్రాలు కూడా తెరవకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు,జిల్లాల్లో ముగ్గురు మంత్రులు ఉండి కూడా ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి దాపురించిందని వ్యాఖ్యానించారు….

రైతు మహాధర్నాలో ప్రసంగిస్తున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్….
ఈ సందర్భంగా జిల్లా మంత్రులపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిప్పులు చెరిగారు, ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా అభివృద్ధి శూన్యమని,మంత్రులు కమీషన్లు,భూ కబ్జాల్లో మునిగితేలుతున్నారని,పార్టీలు మారడం తప్ప తుమ్మల నాగేశ్వరరావుకు ఏం అనుభవం ఉందని ప్రశ్నించారు,మంత్రులకు కమిషన్లు, పర్సంటేజీలు,భూముల మీద ఉన్న ఇంట్రెస్ట్ రైతు సమస్యల లేదని దుయ్యబట్టారు.పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర రైతులు మంటలు మండిస్తారని, రైతులు ఎదురుదిరిగితే ఎట్లా ఉంటుందో మీ ఊహకు కూడా అందదని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారు ఇప్పుడు కల్లకు కట్టినట్టు కనబడుతుందని,తెలంగాణలో మళ్ళీ స్వర్ణ యుగం రావాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు,ఈ కార్యక్రమంలో గారు,మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు,మాజీ చైర్మన్లు కూరాకుల నాఘభూషణం,RJC కృష్ణ,బచ్చు విజయ్ కుమార్,ఖమర్,నగర అధ్యక్షులు పగడాల నాగరాజు,మండల అధ్యక్షులు అజ్మీరా వీరు నాయక్ మరియు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు……
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
