జన్మదినం సందర్భంగా కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్న పువ్వాడ అజయ్ కుమార్!!

Pathi Sreenivas Rao
1 Min Read

మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన జన్మదినం సందర్భంగా తన కుమారుడు నయన్ రాజ్ తో కలిసి మాజీ ముఖ్యమంత్రి,బి.ఆర్.ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు,ఈ సందర్భంగా కేసిఆర్ అజయ్ కుమార్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు, ఖమ్మం జిల్లాలో పార్టీ యొక్క స్థితిగతులపై
కాసేపు ముచ్చటించినట్లు తెలుస్తుంది….

ఆ తరువాత బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కూడా మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం పొందారు,రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయాల్లో చురుగ్గా ఉండాలని, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పై గులాబీ జెండా ఎగిరే విధంగా కృషి చేయాలని సూచించారు,అంతే కాకుండా తన జన్మదినం రోజున బి.ఆర్.ఎస్ పార్టీ మినీ ప్లీనరీని ఏర్పాటు చేయడం,
కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు,బ్యానర్లు, తోరణాలు ఏర్పాటు చేయడంతో ఖమ్మం నగరం గులాబీ వర్ణాన్ని సంతరించుకుంది,పార్టీ కేడర్లో నూతనోత్సాం నెలకొంది….

గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీ కేడర్ కొంత
నిస్తేజంగా ఉన్నప్పటికీ సమయానుకూలంగా పువ్వాడ అజయ్ కుమార్ నియోజకవర్గంలో అనేక పర్యాయాలు పర్యటించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు పార్టీ కేడర్ ను చెక్కు చెదరకుండా కాపాడుకోగలిగాడు,
ఈ ఈ క్రమంలో తన జన్మదినాన్ని పురస్కరించుకుని మినీ ప్లీనరీని ఏర్పాటు చేయడం దానికి మాజీ మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నడంతో బి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తల్లో పండుగ వాతావరణం నెలకొని ఉంది…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment