ఈనెల 19న ఖమ్మం నగరంలో బీఆర్‌ఎస్ మినీ ప్లీనరీ: పువ్వాడ అజయ్ కుమార్!!

Pathi Sreenivas Rao
2 Min Read
.....
Highlights
  • ఈనెల 19న ఖమ్మం నగరంలో బీఆర్‌ఎస్ మినీ ప్లీనరీ సమావేశం నిర్వహణ.....
  • ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు హాజరు......
  • బి.ఆర్.యస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ....
  • కాంగ్రెస్ వైఫల్యాలపై పార్టీ కేడర్‌కు అవగాహన, చైతన్యం కల్పించడం లక్ష్యం......
  • పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు పదవులతో గౌరవం.....
  • ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ విజయానికి భవిష్యత్ కార్యాచరణకై దిశానిర్దేశం......

ఖమ్మం నగరంలో ఈనెల 19వ తేదీన నిర్వహించనున్న బీఆర్‌ఎస్ మినీ ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు హాజరుకానున్నారు అదే తెలిపారు,అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్,తన్నీరు హరీష్ రావు నాయకత్వం,మార్గదర్శకత్వంలో పార్టీ మరింత బలపడుతూ ప్రజలకు సేవలు అందిస్తోందని తెలిపారు.అలాగే అధినేత కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో మరింతగా చర్చించుకునేందుకు ఈ మినీ ప్లీనరీ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు……

అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ప్రజలు మోసపోయిన విషయాన్ని ఇప్పటికే అర్థం చేసుకున్నారని, వారి వైఫల్య పాలనపై పార్టీ కేడర్‌ను చైతన్యవంతం చేయడమే ఈ సమావేశం లక్ష్యమని,కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలను మినీ ప్లీనరీ అనంతరం పార్టీ పదవులతో గౌరవిస్తామని,రఘునాథపాలెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు గట్టి బుద్ధి చెప్పారని, రాబోయే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ప్రజలు చైతన్యవంతమైన తీర్పు ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు,అలాగే, స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు, మోసాలు ప్రజలకు బహిర్గతమయ్యాయని, కేవలం ఒకే ఒక సంవత్సరంలో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు.రాబోయే కాలంలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా అవుతారని, బీఆర్‌ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు……

తాను అవినీతి లేదా అక్రమాల కోసం రాజకీయాల్లోకి రాలేదని, విలువలు ఉన్న కుటుంబం నుండి ప్రజాసేవే లక్ష్యంగా వచ్చానని స్పష్టం చేశారు. తనపై చేసిన ఆరోపణలు రాజకీయ కుట్రలేనని, అవి ఇప్పటికే బయటపడ్డాయని,పార్టీకి నష్టం కలిగించేలా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పార్టీ కోసం కేసులు, ఒత్తిడులను లెక్కచేయకుండా పనిచేసే ప్రతి కార్యకర్తను గౌరవంగా చూసుకుంటామని చెప్పారు, రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గ ప్రజలకు చేసిన అభివృద్ధి పనులే బీఆర్‌ఎస్ పార్టీ విజయానికి బలంగా నిలుస్తాయని, అందరూ ఐక్యంగా పనిచేసి మినీ ప్లీనరీని ఘనవిజయంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు,ఈ కార్యక్రమం అనంతరం నాయకులను, కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ అందరితో సన్నిహితంగా మమేకమయ్యారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో డివిజన్ స్థాయి క్యాడర్ ఉత్సాహంగా పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment