జనం ముచ్చట, ఖమ్మం జిల్లా:
గత పది రోజుల క్రితం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 147,148,149 భూదాన్ యూనిటీ సెంటర్ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీస్ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు-లెనినిస్టు) UCCRIML OPDR ఆధ్వర్యంలో గ్రామీణ పేదల సంఘం పేరుతో నిర్మించిన దాదాపు ఆరు వందల పేదల గుడిసెలను కూల్చిన సంగతి విదితమే…..
భూదాన్ భూముల్లో శిధిలాలను తొలగిస్తున్న వీడియో…..
అక్రమ కూల్చివేతలు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా
వివిధ పార్టీలు,సంఘాలు బాధితులకు అండగా అనేక ధర్నాలు నిర్వహించారు, కూల్చివేతల అంశం ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో,అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ అవడం, ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులపై ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఇరుకున పడింది, డ్యామేజ్ కంట్రోల్ కోసం రంగంలోకి దిగిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశంపెట్టీ గుడిసెలు కోల్పోయిన వారిలో అర్హులైన వారందరికీ ప్లాట్లు ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు…..

శిధిలాలను తొలగిస్తున్న దృశ్యం….
తాజాగా కూల్చివేతలు జరిగిన ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు పోలీసుల పహరా మధ్య శిధిలాలను తొలగిస్తున్నారు,పదుల సంఖ్యలో ప్రోక్లైనర్లు,వందలాది ట్రాక్టర్లు, టిప్పర్ల సహాయంతో యుద్ధ ప్రాతిపదికన శిధిలాలను తొలగిస్తున్నారు,ఇంత పెద్ద ఎత్తున టిప్పర్లు,ట్రాక్టర్లు పెట్టీ శిధిలాలను తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని అక్కడి అధికారులను “జనం ముచ్చట” ప్రశ్నించగా పైఅధికారుల ఆదేశాల మేరకు శిథిలాలు తొలగిస్తున్నామని,అంతకు మించి మాకేమి తెలియదని తెలిపారు కాగా రేపు సాయంత్రం నాలుగు గంటలకు జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో భూదాన్ భూముల్లో ఇళ్ళు కోల్పోయిన అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిసింది….
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
