హెచ్.పి.వి.వ్యాక్సినేషన్ పై అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి అవగాహన కార్యక్రమం!!

Pathi Sreenivas Rao
2 Min Read
.....

కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్, హెచ్.పి.వి. వ్యాక్సినేషన్ కార్యక్రమంపై జిల్లా అధికారులకు పలు సూచనలు జారీ చేశారు,అర్హులైన బాలికలకు పూర్తి స్థాయిలో హెచ్.పి.వి. వ్యాక్సినేషన్ అందించాలని సూచించారు,ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో మహిళా దినోత్సవం సందర్భంగా హెచ్.పి.వి. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించడం జరిగిందన్నారు,14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15 సంవత్సరాల వరకు వయస్సు ఉన్న బాలికలకు హెచ్.పీ.వి. టీకా అందించడం ద్వారా గర్భాశయ ముఖ ద్వారా వచ్చే క్యాన్సర్ ను కట్టడి చేసే అవకాశం ఉంటుందని అన్నారు….

ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, సి.హెచ్.సి. లు నేలకొండపల్లి, తిరుమలాయ పాలెం, కల్లూరు, మధిర, పెనుబల్లి, సత్తుపల్లి, వైరా ఏరియా ఆసుపత్రి నందు ప్రతి రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వ్యాక్సినేషన్ అందిస్తున్నట్లు తెలిపారు,ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువు తున్న బాలికల్లో 14వ సంవత్సరం పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలోకి వస్తున్న ఆడపిల్లలందరూ వారి తల్లిదండ్రులతో ఏదైనా సి.హెచ్.సి., జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వెళ్లి తప్పనిసరిగా హెచ్.పి.వి. వాక్సినేషన్ తీసుకునేలా మండల విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకునేటట్లు ఆదేశాలు జారీ చేయాలని డిఈఓను ఆదేశించారు…..

బాలికల తల్లిదండ్రుల ఆమోదంతోనే హెచ్.పీ.వి. టీకా వేస్తామని, హెచ్.పి.వి. వ్యాక్సినేషన్ అనంతరం అరగంట పాటు పరిశీలించిన తర్వాత వారిని పంపడం జరుగుతుందని, ఈ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని, జిల్లా వ్యాప్తంగా 11 వేల 460 మంది బాలికలు 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15 సంవత్సరాల వరకు వయస్సు మధ్య ఉండవచ్చని అంచనా ఉందని,వీరందరికీ వ్యాక్సినేషన్ అందించాలని తెలిపారు,హెచ్.పీ.వి. టీకా వేసుకోవడం వల్ల కలిగే లాభాలను తల్లిదండ్రులకు విస్తృతంగా వివరించి అధిక సంఖ్యలో బాలికలకు టీకా అందేలా చూడాలని అదనపు కలెక్టర్ తెలిపారు….

మార్చి 8 నుంచి మార్చి 14 వరకు గ్లకోమా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్లకోమా ఎటువంటి లక్షణాలు లేకుండా కంటి చూపు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని, కంటిపై ఎటువంటి ఒత్తిడి ఉన్న వెంటనే పరిశీలించి అవసరమైన చికిత్స తీసుకోవాలని అన్నారు,గ్లకోమా పై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా అవసరమైన ఐఈసి మెటీరియల్ తయారు చేసి ప్రతి గ్రామపంచాయతీ, అంగన్వాడి కేంద్రాలకు అందించాలని అదనపు కలెక్టర్ డిఎం అండ్ హెచ్ఓ ను ఆదేశించారు,ఈ సమావేశంలో డిఆర్ఓ ఏ.పద్మశ్రీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రామారావు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు……

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment