జనం ముచ్చట, ఖమ్మం జిల్లా:
అంతా నా ఇష్టం…. అడిగేదేవడ్రా నా ఇష్టం….
అనే సినిమా డైలాగుకు బాగా ఇన్స్పైర్ అయినట్లున్నాడు ఖమ్మం పట్టణానికి చెందిన ఓ ఇసుక,మట్టి వ్యాపారి ఏకంగా ముదిగొండ మండలం గంగాపురం (డిజాస్టర్ విలేజ్) రెవెన్యూ పరిధిలోని 122,123,124,125,126 సర్వే నెంబర్లో పదమూడు ఎకరాల ముప్పై అయిదు కుంటల భూమిని ఖమ్మం పట్టణానికి చెందిన ఓ మట్టి వ్యాపారి కొనుగోలు చేసి పట్టదారు పాస్ పుస్తకాలు పొందాడు,ఎన్నో ఏళ్ళ క్రితం ముంపునకు గురై ప్రజలు గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు అప్పటి నుండి ఆ గ్రామం ప్రభుత్వ రికార్డుల్లో డిజాస్టర్ విలేజ్ గా నమోదు అయింది,అప్పటి నుండి ఆ గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి అమ్మకాలు,కొనుగోళ్లకు ఆస్కారం లేదు కానీ సదరు వ్యాపారి కొనుగోలు చేసిన పదమూడు ఎకరాల ముప్పై అయిదు కుంటల డిజాస్టర్ భూమికి మాత్రం పట్టదారు పాస్ పుస్తకాలు జారి చేశారు,ఇది ఎలా సాధ్యపడింది,దీనికి సహకరించిన విలేజ్ సెక్రటరీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్, తహసీల్దార్ ఎవరు అనేది అంతుబట్టని విషయం,ఈ భూమికి దానికి రైతు భరోసా డబ్బులు కూడా పడటం విశేషం….

మట్టి వ్యాపారి ఏర్పాటు చేసిన గేటు దానికి సీసీ కెమెరాలు అమర్చిన దృశ్యం….
ఇది పూర్తిగా మున్నేరు ముంపు ప్రాంతం కావడంతో ప్రతి ఏటా వచ్చే వరదలకు ఇసుక మేట వేయడం ఎన్నో ఏండ్లుగా సహజ సిద్ధంగా వస్తుంది,ఇలా ఏర్పడిన ఇసుకను రెవెన్యూ అధికారులు ఎన్నో ఏండ్లుగా కూపన్లు ద్వారా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి,ప్రజా అవసరాలకు ఉపయోగించేవారు,ఈ భూమి భౌగోళికంగా చింతకాని మండలం చిన్నమండవ గ్రామానికి ఆనుకుని ఉండడంతో ఈ ఇసుకను చింతకాని మండలం ప్రజలు ఎక్కువగా ఉపయోగించుకునే వారు,కానీ ఎపుడైతే ఆ భూమిని మట్టి వ్యాపారి కొనుగోలు చేశాడో అప్పటి నుండి ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి, మున్నేరులో ఇసుకను నింపుకున్న ట్రాక్టర్లు,లారీలు మున్నేరు నుండి బయటకు రావాలంటే సదరు వ్యాపారి అక్రమంగా కొనుగోలు చేసిన భూమి నుండి రావాలి,ఆది ఎప్పటి నుండో ప్రజలు వాడుతున్న దారి,ఇసుక వాహనాల రాకపోకలకు ఏకైక మార్గం కాబట్టి దాన్ని ఆసరగా తీసుకుని సదరు వ్యాపారి రెచ్చిపోయాడు,సొంతంగా టోల్ గేట్ ఏర్పాటు చేసి ట్రిప్పుకు వెయ్యి రూపాయల నుండి పదిహేను వందలు ఇస్తే తప్ప నా భూమి నుండి దారి ఇవ్వనని,సచ్చినట్లు మీరు డబ్బులు కట్టి తీరాల్సిందేననని హుకుం జారీచేసి లక్షల రూపాయలు అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు…..
ఇందిరమ్మ లబ్ధిదారులకు సమయానికి ఇసుక అందకపోవడంతో ఎన్నోసార్లు తహసీల్దార్, ఎస్సైల దగ్గర మొరపెట్టుకున్న పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు డిప్యూటీ సీఎం. మల్లు భట్టి విక్రమార్కకు పిర్యాదు చేశారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం విచారణకు ఆదేశించడంతో కదిలిన జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో విచారణ జరిపి తహసీల్దార్,ఎస్సైలను బాధ్యులుగా చేసి బదిలీ వేటు వేసారు,అక్రమాలకు పాల్పడ్డ వ్యాపారిపై చింతకాని పోలీస్ స్టేషన్లో నాన్ బెయిల్ బుల్ కేసు నమోదు చేసారు కానీ అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది,సదరు వ్యాపారి అందుబాటులో ఉన్నప్పటికీ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదో అర్థం కావడం లేదని స్థానికులు అంటున్నారు,ఈ కేసు విషయంలో జిల్లాకు చెందిన ఓ మంత్రి ప్రధాన అనుచరుడు పెద్ద స్థాయిలో పైరవీ చేసి అరెస్టును అడ్డుకున్నాడని ఈ విషయంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయని గుసగుసలు వినిపిస్తున్నాయి,అంతే కాకుండా సదరు వ్యాపారి చేసే అక్రమ అక్రమ వ్యాపారాల్లో జిల్లాకు చెందిన ఓ మంత్రి తనయుని పేరు వివిధ డిపార్ట్మెంట్ల అధికారుల దగ్గర బాగా ఉపయోగిస్తున్నట్లు దృష్టికి వచ్చింది కాకపోతే ఇలాంటి వ్యక్తులను తాను దగ్గరకు రానివ్వడనే టాక్ ప్రజల్లో ఉంది…….
ఏది ఏమైనా గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని
కోట్లకు పడగలెత్తిన మట్టి వ్యాపారి ప్రభుత్వం మారినా తన హవా కొనసాగిస్తున్నాడని, ఇన్ని అక్రమాలు చేసినా తనకు సహకరించిన అధికారులు బలవుతున్నారు కానీ తాను మాత్రం తప్పించుకుంటున్నాడని ప్రజలు భావిస్తున్నారు,అంతే కాకుండా రఘునాథపాలెం మండలంలో బినామీ పేర్లతో సాగించిన అక్రమ మైనింగ్ పై కోట్ల రూపాయల ఫైన్ విధించినప్పటికీ రాజకీయ పలుకుబడి ఉపయోగించి పైన్ కట్టకుండా తప్పించుకుని తిరుగుతున్న వైనంపై పూర్తి ఆధారాలతో “జనం ముచ్చట” లో రేపు ఉదయం మరో ఇంట్రెస్టింగ్ కథనం ప్రచురితమవుతుంది గమనించ గలరు…..
