BRS పార్టీకి డిపాజిట్లు దక్కొద్దు :ఇల్లెందు సభలో మంత్రి పొంగులేటి సీరియస్ వ్యాఖ్యలు….

Pathi Sreenivas Rao
2 Min Read

మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈ రోజు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన రోడ్ షో లో శాసనసభ్యులు కోరం కనకయ్య, డిసిసి అధ్యక్షురాలు దేవి ప్రసన్న స్థానిక నాయకులు వార్డుల అభ్యర్ధులతో మంత్రి పొంగులేటి ప్రచారం నిర్వహించారు,ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు,డప్పు వాయిద్యాలు,మహిళలు కోలాటాలతో మంత్రి పొంగులేటికి ఘన స్వాగతం పలికార….

ఈ సందర్బంగా జరిగిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ కాంగ్రెెస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీది,ఇల్లెందు పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే బాధ్యత నాది అన్నారు,ఇల్లెందు పట్టణంలో వచ్చిన ఈ జన స్పందన చూస్తుంటే ప్రతిపక్షానికి డిపాజిట్లు దక్కుతాయో లేదో అంటూ వ్యాక్యాణించారు,అంతే కాకుండా రెవిన్యూ శాఖ మంత్రిగా ప్రభుత్వ భూములు ఎక్కడైతే నివాసయోగ్యానికి అనుకూలంగా ఉన్నాయో తప్పకుండా అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత నాదేనని, ప్రధాన సమస్య అయిన సింగరేణి ప్రాంతంలో ఇల్లు కట్టుకున్న వాటిని చాలా వరకు రెగ్యులరైజ్ చేశాం,ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. త్వరలో 76 జీవో ప్రకారం సమస్యలు పరిష్కరించే బాధ్యత నాదేనని హామీ ఇచ్చారు….

అదేవిధంగా రాజీవ్ గృహ కల్పలో, మొండి గోడలతో నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తిచేసి పేదలకు అందిస్తామని,పట్టణంలో ఆక్రమానికి గురైన అయిదు ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకొని అక్కడ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడతామని, గోవింద సెంటర్ ప్రభుత్వ పాఠశాల దగ్గర ముస్లిం మైనార్టీలకు షాదీకాన భవనం కోసం ఇప్పటికే నిధులు మంజూరు చేశామని,కూసుపల్లి ఓపెన్ కాస్ట్ ని సింగరేణి ద్వారా దాన్ని కూడా ప్రారంభించే కార్యక్రమాన్ని చేపడతామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు,ఈ నెల11న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన 24 వార్డుల అభ్యర్ధులను గెలిపించి ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధికి కోసం మనస్ఫూర్తిగా సహాయ సహకారాలు అందించాలని ఇల్లెందు పట్టణ ప్రజలను మంత్రి పొంగులేటి
కోరారు…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment