ఖమ్మం:Feb:4:2:2026
ఈ రోజు వైరాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఖమ్మం నుండి వివిధ వార్డులకు ఇంచార్జులగా వెళ్ళిన నాయకులకు, వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కౌన్సిలర్అ భ్యర్థులకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దిశానిర్దేశం చేశారు,మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిని ప్రకటించి క్లారిటీతో పనిచేస్తున్నామని మిగతా పార్టీలు అంత దైర్యం చేయలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు….

సమావేశంలోమాట్లాడుతున్నమాజీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్…
ఓటర్లను కన్ఫ్యూజ్ చేయడానికి కొన్ని వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులకు చపాతీ రోలర్ గుర్తులు కేటాయించి ఓటర్లను కన్ఫ్యూజ్ చేసే కుటిల యత్నాలకు అధికార పార్టీ పాటుపడుతుందని అలాంటి ఎత్తు గడలను తిప్పి కొట్టాలని ఇంచార్జులకు, కౌన్సిలర్ అభ్యర్థులకు అజయ్ కుమార్ సూచించారు,కాంగ్రెస్ పార్టీ 25 నెలల పరిపాలనలో ప్రజలను మోసం చేసి 6 గ్యారంటీలకు మంగళం పాడిందని,నాడు కేసీఆర్ ప్రభుత్వంలో నాట్లకు నాట్లకు మధ్యలో రైతు బందు రైతుల ఖాతాల్లోకి జమ అయ్యేవని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓట్లకు ఓట్లకు మధ్యలో రైతు భరోసా వేస్తున్నాడని తీవ్రంగా దుయ్యబట్టారు,కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల బాకీ కార్డులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అసమర్థ కాంగ్రెస్ పాలనను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని, అంతే కాకుండా ఈ నెల 11న జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కార్యకర్తలతా కలిసికట్టుగా పని చేసి బిఆర్ఎస్,సిపిఎం,సిపిఐ అభ్యర్థులను గెలుపునకు ఇంచార్జీలు కృషి చేయాలని ఇంచార్జులను కోరారు……

సమావేశానికి హాజరైన ఇంచార్జీలు, కౌన్సిలర్ అభ్యర్థులు, ముఖ్య కార్యకర్తలు….
ఈ సందర్భంగా కాంగ్రెస్,బీజేపీ పార్టీల నుండి షేక్ పాషా,పల్లెపు రాము,మరికంటి శివ,గుగులోతు రాము ఆధ్వర్యంలో బారీగా కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు,కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చంద్రావతి,బానోతు మంజుల,లకావత్ గిరిబాబు,కృష్ణార్జున రావు,విశ్వేశ్వర్రావు,మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,మండల అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వర్లు,టౌన్ అధ్యక్షుడు సురేష్,సిపిఎం కార్యదర్శి వీరభద్రం,సిపిఎం జిల్లా నాయకులు బొంతు రాంబాబు,కార్పొరేటర్లు,నా యకులు తదితరులు పాల్గొన్నారు….

వివిధ పార్టీల నుండి BRS పార్టీలో చేరుతున్న నాయకులు, కార్యకర్తలు….

Pathi Srinivasa Rao:9703973456
