మాట ఇస్తే మడమ తిప్పేదే లేదు :మంత్రి పొంగులేటి!!

Pathi Sreenivas Rao
2 Min Read
Highlights
  • జూన్ కల్లా కరకట్ట పూర్తి చేసి ఏదులాపురం ప్రజల ముంపు కష్టాలు తీర్చి తీరుతా.....
  • సక సౌకర్యాలతో ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతా....
  • రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం..అభివృద్ధికి బాటలు వేద్దాం....

ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 2, 22, 23, 24, 26, 27వ వార్డుల్లో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు,కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో కలిపి సుమారు రూ.308 కోట్లతో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని,ఏదులాపురం మున్సిపాలిటీనీ రాష్ట్రానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతానని,అభివృద్ధి చేసే హస్తం గుర్తుకే ఓటేయాలని మున్సిపాలిటీ ప్రజలకు పిలుపునిచ్చారు….

అదే విధంగా రూ. 690 కోట్లతో మున్నేరుకు ఇరువైపులా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ ఏదులాపురం మున్సిపాలిటీకి రక్షణ కవచంలా మారుతుందని,2వ వార్డు రాజీవ్ గృహకల్ప ఇళ్లకు కొత్త హంగులు చేకూర్చడంతో పాటు ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నల్లా నీరు ఇచ్చి, ఇతర మౌలిక సౌకర్యాలను మెరుగుపరుస్తానని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు,ప్రతి వార్డులో అవసరమైన రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, స్ట్రీట్ లైట్స్ వంటి ప్రతి సమస్యలను తీర్చేలా పనిచేసే ఇందిరమ్మ ప్రభుత్వానికి అండగా ఉండాలని ప్రజలను కోరారు….

ఈ సందర్బంగా BRS పార్టీపై మంత్రి పొంగులేటి నిప్పులు చేరిగారు,పదేళ్ల పాటు రాష్ట్రాన్ని, ప్రజలను గాలికొదిలేసి ఇవాళ ఎన్నికలు రాగానే దండాలు పెట్టుకుంటూ వస్తున్న నాయకులను నమ్మవద్దు,పేదోడికి ఓ రేషన్ కార్డు ఇవ్వడానికి మనసు రాని వాళ్లకు మళ్లీ ఓట్లు వేయాలా ? ప్రజలు ఆలోచన చేయాలని,నాడు ఫామ్ హౌస్‌లకే పరిమితమై, గాలి మోటార్లలో తిరిగిన నాయకులకు ఈ గల్లీల్లో డ్రైనేజీలు పొంగుతుంటే, ఇళ్లు మునుగుతుంటే ఏనాడైనా కనిపించిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు,ఇది పేదల ప్రభుత్వమని, ఇందిరమ్మ ప్రభుత్వంలో పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని,ఏదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు….

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment